Share News

Harish Rao: బ్రహ్మణ పరిషత్‌పై సీఎం రేవంత్‌కు హరీష్‌ లేఖ

ABN , Publish Date - Jul 12 , 2024 | 03:17 PM

Telangana: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ గురించి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ హరీష్ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరమన్నారు. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరమన్నారు.

Harish Rao: బ్రహ్మణ పరిషత్‌పై సీఎం రేవంత్‌కు హరీష్‌ లేఖ
Former Minister Harish Rao

హైదరాబాద్, జూలై 12: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ గురించి సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Former Minister Harish Rao) బహిరంగ లేఖ హరీష్ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరమన్నారు. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరమన్నారు. అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా? అనే ఆందోళన బ్రాహ్మణ సామాజిక వర్గంలో నెలకొందని తెలిపారు.

YS Sharmila: వైఎస్సార్‌కు.. వైసీపీ‌కి సంబంధం లేదు...


అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని... దీంతో సంక్షేమ పరిషత్ ద్వారా అమలు చేసే పథకాలు నిలిచిపోయాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఎంతో మంది పేద బ్రాహ్మణులకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరుతున్నాను అంటూ హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Danam Nagender: త్వరలో బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం... దానం షాకింగ్ కామెంట్స్

Delhi Liquor Case: కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక పరిణామం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 12 , 2024 | 03:21 PM