Share News

Harishrao: పోలీసులకు హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్..

ABN , Publish Date - Sep 23 , 2024 | 12:17 PM

Telangana: తెలంగాణ పోలీసులకు హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో ఏమైందో పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొందరు పోలీస్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. ఏపీ తరహా పరిణామాలు ఎదుర్కోవటానికి పోలీసులు సిద్ధంగా ఉండాలంటూ మాజీ మంత్రి హెచ్చరించారు.

Harishrao: పోలీసులకు హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్..
Former Minister Harisha Rao

హైదరాబాద్, సెప్టెంబర్ 23: మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao)స్పందించారు. ఈ సందర్భంగా ఏపీ పోలీస్‌శాఖలో జరిగిన పరిణామాలను మాజీ మంత్రి గుర్తుచేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు.. పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో ఏమైందో పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొందరు పోలీస్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. ఏపీ తరహా పరిణామాలు ఎదుర్కోవటానికి పోలీసులు సిద్ధంగా ఉండాలంటూ మాజీ మంత్రి హెచ్చరించారు.

Krishnarao: హైడ్రా కూల్చివేతలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు


చట్టాలకు లోబడి మాత్రమే పోలీసులు పనిచేయాలని హితవుపలికారు. బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు. కొందరు పోలీసు అధికారాలు తీరు మార్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హయాంలో గుండాయిజం పెరిగిపోయిందన్నారు. అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని తెలిపారు. తొమ్మిది నెలల కాలంలో 2 వేల అత్యాచారాలు జరిగాయన్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటి మీదకు వెళ్ళి దాడి చేయటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి పేర్కొన్నారు.

Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై ‘సిట్‌’కు ఏపీ సర్కార్ ఆదేశం


ఫిరాయింపులపై...

పార్టీ ఫిరాయింపులపై హరీష్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా ఫిరాయింపులపై కాంగ్రెస్ బుకాయింపులు మానుకోవాలన్నారు. అబద్దం అతికేటట్టు ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు తెలుసుకోవాలని హితవుపలికారు. ఫిరాయింపులపై మంత్రి శ్రీధర్ బాబు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారన్నారు. మర్యాదపూర్వకంగా అయితే సీఎంను పార్టీ మీటింగ్‌లో కలుస్తారా? అని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీ సొంత నియోజకవర్గానికి సీఎం వస్తే.. ప్రకాష్ గౌడ్ ఎందుకొచ్చినట్లు అని అడిగారు. కాంగ్రెస్ నీతిని ప్రజలు గమనిస్తున్నారని. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు శిక్ష తప్పదని హరీష్‌రావు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

200 Year Old Message: గాజు సీసాలో 200 ఏళ్ల నాటి సందేశం.. పురావస్తు శాఖ తవ్వకాల్లో లభ్యం

HYDRA: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు....

Read latest Telangana News And Telugu News

Updated Date - Sep 23 , 2024 | 12:22 PM