Share News

HYDRA: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్... కారణమిదే

ABN , Publish Date - Oct 01 , 2024 | 09:36 AM

Telangana: మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. మూసీకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు జంట జలాశయాల గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. కాసేపటి క్రితమే జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లను ఎత్తివేశారు. మరికాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేయనున్నారు.

HYDRA: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్... కారణమిదే
High alert in Musi catchment areas

హైదరాబాద్, అక్టోబర్ 1: మూసీ (Musi) పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు కూల్చివేతలు.. మార్కింగ్ సర్వే.. అటు జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో అధికారులు హైఅలెర్ట్ జారీ చేశారు. మూసీ సుందరీకరణలో భాగంగా అక్కడి ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మార్కింగ్ సర్వే కూడా జరిగిపోయింది. కూల్చివేయాల్సిన ఇళ్లకు అధికారులు మార్క్‌ కూడా వేశారు. పలు ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయించేశారు కూడా. ఓల్డ్ మలక్ పేట్‌లో ఖాళీ చేయించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేయనున్నారు. పోలీసు బందోబస్తు మధ్య మార్కింగ్ సర్వే కొనసాగుతోంది.

Gold and Silver Rates: బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..


వరద ఉధృతి

మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. మూసీకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు జంట జలాశయాల గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. కాసేపటి క్రితమే జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లను ఎత్తివేశారు. మరికాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేయనున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 1400 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1428 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లను రెండు ఫీట్ల మేర అధికారులు ఎత్తివేశారు.


అధికారుల హెచ్చరికలు

అటు హిమాయత్ సాగర్‌కు 350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చిచేరుతోంది. కాసేపట్లో హిమాయత్ సాగర్ ఒక గేటును ఎత్తి 350 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదలచేయనున్నారు. మరోవైపు జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద తాకిడి అధికంగా ఉంది. వరద పెరగడంతో మూసీ నది గర్భంలో నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇళ్లను ఖాళీ చేయించడం కోసం గేట్లను ఎత్తారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ సర్వాత్రా నెలకొంది.

అయ్యా..యస్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌..ముగిసిన సర్వీస్‌


కాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి ‌ కేటీఆర్ నేడు (మంగళవారం ) నగరంలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌కు కేటీఆర్ వస్తారు. 9:30 గంటలకు అంబర్ పేట నియోజకవర్గం, గోల్నాక డివిజన్ లంక (తులసి రామ్ నగర్) ప్రాంతంలో ఆయన పర్యటిస్తారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలవనున్నారు. కేటీఆర్‌తో పాటు అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఇతర నేతలు పాల్గొననున్నారు. నిన్న(సోమవారం) హైదర్‌గూడ, కిషన్‌బాగ్‌లో వివిధ కాలనీలకు చెందిన మూసీ బాధితుల వెతలను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. 30, 40 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకొని ఉంటున్నామని, ఉన్నపళంగా వెళ్లిపోవాలంటే ఎలా? అని బాధితులు విలపించారు.


ఇవి కూడా చదవండి...

Konda Surekha: సోదర సమానుడు.. నూలు దండ వేస్తే తప్పా

లెబనాన్‌లోకి ఇజ్రాయెల్‌!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 01 , 2024 | 10:25 AM