Share News

Kishan Reddy: కవిత అరెస్ట్‌పై పార్టీ నేతలకు కిషన్ రెడ్డి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Mar 16 , 2024 | 07:52 AM

కవిత అరెస్ట్‌పై పార్టీ నేతలకు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ నేతలతో గత రాత్రి కిషన్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా.. కవిత అరెస్ట్ విషయంలో తొందరపడి మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆయన ఆదేశించారు.

Kishan Reddy: కవిత అరెస్ట్‌పై పార్టీ నేతలకు కిషన్ రెడ్డి కీలక ఆదేశాలు

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్ట్‌పై పార్టీ నేతలకు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ (BJP) నేతలతో గత రాత్రి కిషన్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా.. కవిత అరెస్ట్ విషయంలో తొందరపడి మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆయన ఆదేశించారు. కవిత అరెస్ట్ కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ చెబుతోంది. కవిత ఎపిసోడ్ తెలంగాణ (Telangana)కు సంబంధించినది కాదని.. అది ఆమె వ్యక్తిగత వ్యవహారమని అంటోంది. కవిత అరెస్ట్ విషయంలో బీజేపీ నేతలెవరూ మీడియాలో మాట్లాడొద్దని పార్టీ పెద్దలు నిర్ణయించారు.

Kavitha Arrest: కారుతో దోస్తీ లేదని చాటుకోవడానికే!.. కవిత అరెస్టు ఈ నేపథ్యంలోనే?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2024 | 07:57 AM