KTR: అప్పులు చెప్పిన వాళ్లు.. ఆస్తులు కూడా చెప్పాల్సిందే...
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:01 PM
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఆపై ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చ ప్రారంభమైంది. బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్ చర్చను మొదలుపెట్టారు. పదేళ్ల క్రితం కిరణ్‌కుమార్‌రెడ్డి..
హైదరాబాద్, జూలై 31: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ప్రవేశపెట్టారు. ఆపై ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చ ప్రారంభమైంది. బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్ (BRS MLA KTR) చర్చను మొదలుపెట్టారు. పదేళ్ల క్రితం కిరణ్‌కుమార్‌రెడ్డి.. తెలంగాణ చీకట్లతో నిండిపోతుందని చెప్పారని.. తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా?.. అని ఉమ్మడి రాష్ట్రంలో హేళన చేశారని గుర్తుచేశారు.
Tungabhadra Express: తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని వ్యక్తి మృతి..
పదేళ్లలో రాష్ట్ర సంపద పెరిగిందని గతంలో భట్టి విక్రమార్క చెప్పారని.. కానీ అధికారంలోకి వచ్చాక.. మాట మారుస్తున్నారన్నారు. విభజన జరిగితే తెలంగాణ అంధకారం అవుతుందన్నారని.. తెలంగాణ వస్తే శాంతిభద్రతల సమస్యలు వస్తుందన్నారని అన్నారు. ఏపీ - తెలంగాణలో మత ఘర్షణలు వస్తాయన్నారని, అలాగే తెలంగాణలో నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారని ఆనాటి సంగతులను గుర్తుచేశారు. అంతేకాకుండా తెలంగాణ వారికి పరిపాలన సామర్థ్యం ఉందా? అని కూడా అన్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావని.. ఉన్నవి పోతాయన్నారని తెలిపారు.
Rinku Singh: బ్యాటే కాదు బాల్‌తో ఇరగదీశాడు..
కానీ ఇప్పుడు టాప్-4 స్టేట్స్‌లో తెలంగాణ ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టులోనే పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయన్నారు. ‘‘బీఆర్‌ఎస్ పాలన గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు.. గత కాంగ్రెస్ పాలనపై మేమెందుకు మాట్లాడకూడదు’’ అని ప్రశ్నించారు. ఓట్లకు ముందేమో అభయహస్తం.. ఓట్ల తర్వాత శూన్యహస్తమని విమరశించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. మంచి నిర్ణయాలకు బీఆర్‌ఎస్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు. స్కిల్ వర్సిటీని తప్పకుండా స్వాగతిస్తామని తెలిపారు. రాష్ట్రం క్యాన్సర్, ఎయిడ్స్ రోగిలా దివాలా తీసిందనడం కరెక్ట్ కాదన్నారు. కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందన్నారు. కరోనా ముందు తాము కూడా జీతాలు సక్రమంగానే ఇచ్చామని చెప్పారు. రైతుబంధు, పింఛన్లు, కల్యాణలక్ష్మి ఆగవద్దని అనుకున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సాయం ఆపకూడదని నిధులు మళ్లించి ఉండవచ్చని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్లకు 10 నెలలుగా జీతాలు లేవని.. బీఆర్‌ఎస్ పాలనలో అప్పులు.. రెవెన్యూ బిల్లులకు లోబడి ఉన్నామన్నారు. ‘‘మేం చేసిన నికర అప్పు రూ.3,85,340 కోట్లు మాత్రమే. మేం చేసిన అప్పులు చెప్పినవాళ్లు.. మేం ఇచ్చిన ఆస్తుల గురించి చెప్పాలి. సందప చూస్తేనే అప్పులు ఇస్తారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Madanapalle Incident: మదనపల్లె ఘటనలో కీలక పరిణామం.. ఆ ఎనిమిది కేసులు ఎవరిపైనో..!?
అలాగే.. బడ్జెట్‌లో కోతలు, ఎగవేతలతో మసిబూసి మారేడుకాయ చేశారు. రైతు భరోసాకు బడ్జెట్ ఏదని ప్రశ్నించారు. పెన్షన్ డబుల్ చేసే కేటాయింపులు ఎక్కడని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు ఎన్నికల ముందు రజినీకాంత్, తర్వాత గజినీకాంత్‌లా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాటాల గడ్డ.. మభ్యపెడితే ఊరుకోదని కేటీఆర్ అన్నారు. చార్జిషీట్లు, రికవరీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయాలన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్ ఒకటి విసిరారు. అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి వెళదామని.. ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చినట్లు యువకులు చెబితే అక్కడే రాజీనామా చేయడమే కాదు.. రాజకీయ సన్యాసం చేస్తానంటూ కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. పైగా రేవంత్, భట్టికి పౌర సన్మానం కూడా చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Pawankalyan: పవన్ సారూ.. మీరే దిక్కు!
Hyderabad: దూసుకొచ్చిన ‘ఆర్మీ’ బుల్లెట్.. మహిళ కాలికి గాయం
Read Latest Telangana News And Telugu News