Share News

Harish Rao: ఇంత దిగజారుడుతనమా.. ఇంత దౌర్జన్యమా..

ABN , Publish Date - Sep 25 , 2024 | 10:23 AM

Telangana: సీఎం రేవంత్ రెడ్డి చేసిన నిర్వాకానికి రైతుల పరువు బజారున పడుతున్న పరిస్థితి నెలకొంది అని హరీష్‌ అన్నారు. బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్ళ మీదకు వచ్చి తలుపులు పీకుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. రుణమాఫీపై ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రికి ఇలాంటి సంఘటనలే చెంప పెట్టు అని అన్నారు.

Harish Rao: ఇంత దిగజారుడుతనమా.. ఇంత దౌర్జన్యమా..
Former Minister Harisha Rao

హైదరాబాద్, సెప్టెంబర్ 25: మంచిర్యాల జిల్లా నన్నెల మండలంలో ఓ రైతుపై బ్యాంకు అధికారుల దౌర్జన్యం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌‌రావు(Former Minister Harish Rao) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఇంత దిగజారుడు తనమా? ఇంత దౌర్జన్యమా? అంటూ మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫి పేరిట రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన మోసం రైతుల పాలిటి శాపంగా మారిందని విమర్శించారు.

ఇది జగన్‌ పాపమే!


సీఎం రేవంత్ రెడ్డి చేసిన నిర్వాకానికి రైతుల పరువు బజారున పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్ళ మీదకు వచ్చి తలుపులు పీకుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. రుణమాఫీపై ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రికి ఇలాంటి సంఘటనలే చెంప పెట్టు అని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇళ్ళ మీదకు బుల్డోజర్లు, రైతుల ఇళ్ళ మీదకు బ్యాంకు అధికారులు వెళ్తున్నారని.. ఇదేనా.. పేదలను, రైతులను కంటతడి పెట్టించే కాంగ్రెస్ మార్క్ "మార్పు" అంటూ హరీష్‌ రావు నిలదీశారు.

R Krishnaiah: ఆర్‌ కృష్ణయ్య రాజీనామాలో ట్విస్ట్.. రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ


కేటీఆర్ విమర్శలు...

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఎత్తు కుర్చీల్లో కూర్చోవడం కాదు- కన్నేత్తి రైతుల గోస చూడు ముఖ్యమంత్రి. మాఫీ కానీ రుణమాఫీ- పత్తా లేని పాల బిల్లులు- వేస్తావన్న భరోసా లేని రైతు భరోసా - బోనస్ పేరుతో బోగస్ మాటలు. ఒకటా రెండా అన్నింట్లో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రోడ్డెక్కితే జంకిన మీరు రూ.150 కోట్ల పాల బిల్లుల బకాయిలకు రూ.50 కోట్లు విడుదల ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. మీ పుణ్యమా అని ఈ దసరా రైతులకు మునపటి దసరాలా ఉండేలా లేదు. బోగస్ హామీలతో రైతుల గొంతు నొక్కి గద్దెనెక్కి ఎత్తు కుర్చీల్లో రాచరిక దర్పాన్ని ప్రదర్శిస్తున్న మీరు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

అక్టోబరులో 4.25 లక్షల మందికి రుణమాఫీ!

Kodandaram: దసరా నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 25 , 2024 | 10:27 AM