Rain Alert: హైదరాబాద్‌లో మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం..
ABN , Publish Date - May 16 , 2024 | 02:09 PM
Hyderabad Rains: ఒక రోజు వర్షం.. రెండు రోజులు ఎండ.. మరో రెండు రోజులు ఉక్కపోత.. ఆపై మళ్లీ వర్షం.. ఇదీ ప్రస్తుతం హైదరాబాద్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితి. గతం వారం రోజులుగా వర్షం, ఎండ, ఉక్కపోత గ్యాప్ ఇచ్చి మరీ వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరమంతా చల్లటి వాతావరణం నెలకొంది.
Hyderabad Rains: ఒక రోజు వర్షం.. రెండు రోజులు ఎండ.. మరో రెండు రోజులు ఉక్కపోత.. ఆపై మళ్లీ వర్షం.. ఇదీ ప్రస్తుతం హైదరాబాద్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితి. గతం వారం రోజులుగా వర్షం, ఎండ, ఉక్కపోత గ్యాప్ ఇచ్చి మరీ వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరమంతా చల్లటి వాతావరణం నెలకొంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట్, ఎల్బీనగర్, నాగోల్‌లో వర్షం కురుస్తోంది. ఈ ప్రాంతాలతో పాటు.. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
మరికాసేపట్లో నగరంలో పాటు జిల్లాల్లోనూ వర్షం..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం మరికాసేపట్లో నగరం వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భాగ్యనగరంలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.