Share News

Suprem Court: న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసు నిందితులకు సుప్రీం నోటీసులు

ABN , Publish Date - May 03 , 2024 | 12:46 PM

Telangana: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య వ్యవహారంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. గట్టు వామనరావు దంపతుల హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో వామనరావు కొడుకు గట్టు కిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై తాజాగా సీఐడీతో లేదా సీబీఐతో అయినా తిరిగి విచారణ జరిపించేందుకు తమకు అభ్యంతరం లేదని..

Suprem Court: న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసు నిందితులకు సుప్రీం నోటీసులు
Lawyer Vamanrao Murder Case

న్యూఢిల్లీ, మే 3: తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య వ్యవహారంపై సుప్రీంకోర్టులో (Supreme Court) శుక్రవారం విచారణ జరిగింది. గట్టు వామనరావు దంపతుల హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో వామనరావు కొడుకు గట్టు కిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై తాజాగా సీఐడీతో లేదా సీబీఐతో అయినా తిరిగి విచారణ జరిపించేందుకు తమకు అభ్యంతరం లేదని కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో నిందితులను కూడా ప్రతివాదులుగా చేర్చి వారికి కూడా నోటీసులు ఇవ్వాలని పిటీషనర్‌కు సుప్రీం కోర్టు ఆదేశించింది.

Lok Sabha Polls: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చేసింది.. హామీలే హామీలు


ప్రస్తుతం నిందితులంతా బెయిల్‌పై ఉన్నారని కోర్టుకు పిటీషనర్ తరపు న్యాయవాది తెలిపారు. వారి వాదనలు కూడా విన్న తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్‌వీఎన్ బట్టిల ధర్మాసనం స్పష్టం చేసింది. సీఐడీతో మరోసారి విచారణ జరిపించడానికి అభ్యంతరం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను సుప్రీం ధర్మాసనం రికార్డు చేసింది. సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించే విషయంపై సమాధానం చెప్పాలని నిందితులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలలో మరికొన్ని డాక్యుమెంట్లు సీడీలు అందించేందుకు పిటీషనర్‌కు సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.


కాగా.. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లారామగిరి మండలం కలవచర్లలో కారులో వెళ్తున్న లాయర్ వామనరావు, ఆయన సతీమణి నాగమణి నడిరోడ్డుపై కిరాతంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కారులో వెళ్తున్న దంపతులను నడిరోడ్డుపై అడ్డగించి.. కారులోంచి న్యాయవాదిని బయటకు లాగి కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. కారులో ఉన్న ఆయన భార్యపైనా కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీశారు. మంథని మండలం గుంజపడుగుకు చెందిన గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరించారు.


ఇవి కూడా చదవండి...

Video: స్కూటీ కాదది మినీ వైన్ షాపు.. ముసలోడు ఏం చేశాడంటే..?

AP Elections: నెల్లూరు ఎంపీగా గెలిచేదెవరు.. త్రిముఖ పోరులో పైచేయి ఎవరింటే..?

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 03 , 2024 | 12:51 PM