Share News

CM Revanth: సీఎం అయ్యాక నాలో వచ్చిన మార్పు ఇదే.. రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Jan 06 , 2024 | 08:31 PM

ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నారు. సీఎం అయిన తరువాత.. సీఎం అవక ముందు తనలో వచ్చిన మార్పులపై ఇంట్రస్టింగ్ రిప్లై ఇచ్చారు.

CM Revanth: సీఎం అయ్యాక నాలో వచ్చిన మార్పు ఇదే.. రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
CM Revanth Redyy Interview

CM Revanth Reddy Exclusive Interview: ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నారు. సీఎం అయిన తరువాత.. సీఎం అవక ముందు తనలో వచ్చిన మార్పులపై ఇంట్రస్టింగ్ రిప్లై ఇచ్చారు. కొత్త బాధత్యలు చేపట్టిన తరువాత రేవంత్ మారినట్లున్నారని ఆర్కే ప్రశ్నించగా.. మార్పు లేకపోతే కష్టం అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ యధావిధంగా..

నేను జెడ్పీటీసీగా తొలిసారి గెలిచినప్పుడు ఆ స్థాయిలోనే తన మైండ్‌సెట్, ఆలోచనలు ఉండేవి. ఆ తరువాత స్థానిక సంస్థల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఆలోచనా పరిధి మళ్లీ పెరిగింది. బాధ్యతలు మారిన ప్రతిసారి ఆ బాధత్యలకు అనుగుణంగా అవగాహన పెంచుకోవడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా ఆలోచనల పరిధిని విస్తృతం చేయడం జరిగింది.

2006 జూన్‌లో జెడ్పీటీసీ, 2007లో ఎమ్మెల్సీ, 2009లో ఎమ్మెల్యే, 2014 జూన్‌లో మళ్లీ ఎమ్మెల్యే, 2019 జూన్‌లో ఎంపీ, 2021 జూన్‌లో పీసీసీ అధ్యక్షుడు.. ఇలా జెడ్పీటీసీ నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు పరిణామ క్రమంలో పరిస్థితులను ఆకలింపజేసుకుంటూ.. అవగాహన కల్పించుకుంటూ.. తెలియంది తెలుసుకుంటూ.. కొత్తవి నేర్చుకుంటూ ముందుకు వచ్చాను. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అగ్రెసివ్‌గా ఉండాలి కాబట్టి ఉన్నాను. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది అత్యంత కీలకమైంది. కీలక బాధత్య ఉన్నప్పుడు.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

1995 తరువాత చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ ఈ ముగ్గురూ పాలన పరంగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకులు. ప్రజల్లో తమకంటూ చెరగని ఓ ముద్ర వేసుకున్నారు. ఈ ముగ్గురునీ దృష్టిలో ఉంచుకుని పోల్చుకుంటే.. నాపై బాధత్య ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం తడబాటు పడినా.. రాష్ట్రానికే నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే.. ఎప్పటికప్పుడు.. ఏ రోజుకు ఆరోజు.. పరీక్షలకు ప్రిపేర్ అయిపోయినట్లుగానే.. పరిపాలనకు వెళ్తాను అని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Jan 06 , 2024 | 08:39 PM