Share News

Group-1: గ్రూప్-1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..

ABN , Publish Date - Oct 20 , 2024 | 10:48 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 21నుంచి 27వ తేదీ వరకూ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

Group-1: గ్రూప్-1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..

హైదరాబాద్: గ్రూప్‌-1 పరీక్షలపై తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జీవో 29ను రద్దు చేయాలని, గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. అభ్యర్థుల ధర్నాలకు రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో శుక్ర, శనివారం రెండ్రోజులు హైదరాబాద్ నగరంలో పలు హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులతో మంత్రులు శనివారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఇవాళ(ఆదివారం) రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.


మరోవైపు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 21నుంచి 27వ తేదీ వరకూ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులు రాయనున్నారు. ఇప్పటికే 90శాతం మంది అభ్యర్థులు తుది పరీక్షల కోసం హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. మెుత్తం 563 పోస్టులకు గానూ 31,382మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. తమ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీఎస్‍పీఎస్సీ అభ్యర్థులకు సూచించింది. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. రోజుకో హాల్ టికెట్‌తో అభ్యర్థులు రావొద్దని చెప్పింది.


తొలి రోజు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లిన హాల్ టికెట్‌నే మిగిలిన రోజులూ తమ వెంట తీసుకురావాలని స్పష్టం చేసింది. అయితే హాల్ టికెట్లను ఇప్పటికీ 10శాతం మంది డౌన్ లోడ్ చేసుకోలేదు. వీరంతా నిరసనల్లో పాల్గొంటున్నారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు గ్రూప్ - 1 పరీక్షలు రద్దు కాగా.. మూడోసారీ అదే పరిస్థితి ఎదురవుతుందనే ఆందోళనలో 90శాతం మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Oct 20 , 2024 | 11:01 AM