Rajanna Temple: వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Feb 05 , 2024 | 11:57 AM
రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేసి.. లఘు దర్శనానికి అనుమతిచ్చారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేసి.. లఘు దర్శనానికి అనుమతిచ్చారు. స్వామివారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది. ఆదివారమే వేములవాడ చేరుకున్న భక్తులు సోమవారం ఉదయాన్నే ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. ధర్మగుండంలో స్నానం ఆచరించి ప్రత్యేక క్యూలెన్ద్వారా స్వామివార్లను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా మేడారం జాతర దగ్గర పడడంతో భక్తుల రద్దీ పెరిగింది. గుడి చెరువు మైదానం భక్తుల వాహనాలతో నిండిపోయింది.