Share News

Konda Surekha: రైతు భరోసాపై మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే?

ABN , Publish Date - Sep 17 , 2024 | 11:24 AM

Telangana: రైతు భరోసాపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా పథకం కోసం ప్రతీఒక్క రైతు ఎదురుచూస్తున్న నేపథ్యంలో మంత్రి ఇచ్చిన ప్రకటన ఊరటనిస్తుందనే చెప్పొచ్చు.

Konda Surekha: రైతు భరోసాపై మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే?
Minister Konda Surekha

హనుమకొండ, సెప్టెంబర్ 17: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తీసుకువచ్చిన ఆరు గ్యారెంటీలలో (Congress Garentees) రైతు భరోసా ఒకటి. రైతు భరోసా పథకం కోసం ప్రతీఒక్క రైతు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో రైతు భరోసాపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు. మంగళవారం నాడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని (Telangana Public Administration Day) పురస్కరించుకొని అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. ఆపై జాతీయ జెండాను ఎగురవేశారు.

CM Revanth: కొత్త ఒరవడికి సీఎం నాంది.. నిమజ్జన వేడుకల్లో రేవంత్


ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రాచరిక పాలన నుంచి ప్రజా పాలన నిర్వహించుకుంటున్నామన్నారు. కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, బద్దం ఎల్లా రెడ్డి, కాళోజి నారాయణ రావు, షాయబుల్లా ఖాన్ పోరాట స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామన్నారు. సంస్కృతి, సాంప్రదాయం కాపాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే ప్రభుత్వ కర్తవ్యమని స్పష్టం చేశారు.

MLA: రద్దు చేసిన రేషన్‌కార్డులను పునరుద్ధరించాలి



ఆదర్శ రాష్ట్రంగా నిర్మాణం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం మొదటి ప్రాధ్యానం ఇస్తుందన్నారు. రుణమాఫీ చేసి రైతు సంక్షేమ ప్రభుత్వంగా చరిత్రలోకి ఎక్కిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించడానికి పట్టుదలతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈకార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతో పాటు కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

Ganesh Laddu Record: రికార్డులన్నీ బ్రేక్.. సంచలన ధర పలికిన గణేశుడి లడ్డూ

Special Buses: వినాయక నిమజ్జనాల వేళ ట్రాఫిక్ కష్టాలకు టీజీఎస్ఆర్టీసీ చెక్..


Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 17 , 2024 | 11:26 AM