Share News

Bird Flu Alert : తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఈ కొద్దిరోజులు జాగ్రత్త..

ABN , Publish Date - Feb 12 , 2025 | 03:39 PM

Bird Flu Alert : ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వైరస్ భయం వణికిస్తోంది. కొన్నివారాలుగా చాలా చోట్ల ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మరణించాయి. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కాబట్టి, చికెన్ ప్రియులు కొన్ని రోజుల పాటు ఈ విషయంలోజాగ్రత్తలు పాటించాల్సిందే..

Bird Flu Alert : తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఈ కొద్దిరోజులు జాగ్రత్త..
Bird Flu Virus Cases Increases in AP and Telagana

Bird Flu Alert : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వైరస్ భయం వణికిస్తోంది. కొన్నివారాలుగా చాలా చోట్ల ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మరణించాయి. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతోందని నిర్ధారణ కావడంతో పశుసంవర్ధక శాఖ అడ్వైజరీ జారీ చేసింది. కోళ్లు, గుడ్ల ఎగుమతులు, దిగుమతులను ఆపేసి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇది చికెన్ లవర్స్‌కు పెద్ద షాకే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముక్క లేనిదే ముద్ద దిగదని భీష్మించుకుని కూర్చుంటే అయిపోతారు. సో ఈ విషయంలో కొద్ది రోజులు మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే.


బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది.. ఈ కొద్ది రోజులు జాగ్రత్త..

ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో ఒక్కటే కాదు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. అంతటా ఫారాల్లో పెంచుతున్న కోళ్లు బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో వేలాది కోళ్ళు చనిపోయాయి. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ప్లూ కేసులు బైటపడటంతో.. చనిపోయిన కోళ్లనుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేపట్టారు. పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిల్స్ లో బర్డ్ ప్లూ పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కానూర్, పశ్చిమ గోదావరి సహా అనేక చోట్ల ఇప్పటికే ప్రభుత్వ అధికారులు చికెన్ షాప్ లను మూసి వేయించారు. ముఖ్యంగా ఇప్పటికే బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో ని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అందుకని ముక్క లేకుండా మాకు ముద్ద దిగదు అనుకునేవాళ్లు ఈ కొద్ది రోజుల వరకూ జాగ్రత్తగా ఉండితీరాలని పశుసంవర్ధక శాఖ అడ్వైజరీ జారీ చేసింది.


ఇలా చేస్తే బర్డ్ ప్లూ సోకే అవకాశం..

బర్డ్ ప్లూ వైరస్ సహజంగా జంతువులు, పక్షుల నుంచి మనుషులకు సోకుతుంది. ఎక్కువగా కోళ్ళనుండి వ్యాప్తి చెందే అవకాశముంటుంది. బర్డ్ ప్లూ బారినపడ్డ జంతువులు, పక్షులకు దగ్గరగా ఎక్కువసేపు గడిపినా.. ఈ వ్యాధి సోకిన కోళ్లను తిన్నా మనుషులకు వ్యాపించే అవకాశముంటుంది. చికెన్‌ను బాగా శుభ్రం చేసి ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోయే అవకాశముంటుంది. ఉడికీ ఉడకని చికెన్ తినడంద్వారా ఇది మనుషులకు వ్యాపించే ప్రమాదముంది. అందుకే ప్రస్తుతం బర్డ్ ప్లూ వ్యాప్తి ఎక్కువగా వున్న నేపథ్యంలో చికెన్ తినకుండా వుండటమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


బర్డ్ ప్లూ అంటు వ్యాధి కాదు.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త..

బర్డ్ ప్లూ అనేది అంటువ్యాధి కాదు. ఒకరి వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించదు. కానీ జంతువులు, పక్షుల నుంచి మనుషులకు మాత్రం వ్యాపిస్తుంది. పక్షుల్లో ఇది మరణాలకు దారితీస్తుంది. అలాగే మనుషుల్లో కూడా సమయానికి వైద్యం అందకుంటే ఇది ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి బర్డ్ ప్లూ లక్షణాలు కనిపించగానే వైద్యసహాయం పొందడం ఉత్తమం. బర్డ్ ప్లూ సోకితే 2 నుండి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, జలుబు, ముక్కుకారడం, శ్వాస తీసుకోడంలో ఇబ్బంది, ముక్కు మూసుకుపోవడం, గొంతునొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.


ఇవి కూడా చదవండి..

ఏపీకి మరో గుడ్ న్యూస్...రాష్ట్రంలో మరో సంస్థ

చేప - చికెన్.. ఏది బెస్ట్?

ఆ చైనా యాప్స్ మళ్లీ వచ్చేశాయ్.. జాగ్రత్త

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 12 , 2025 | 03:40 PM