Nagababu: నువ్వు అడవి దొంగ.. పెద్దిరెడ్డి బండారం బయటపెట్టిన నాగబాబు
ABN , Publish Date - Feb 02 , 2025 | 07:20 PM
Nagababu: అవినీతి చేసిన వైసీపీ నేతలను జైలుకు పంపిస్తామని జనసేన అగ్రనేత నాగబాబు హెచ్చరించారు. వైసీపీ ఖాళీ అయిపోతోంది.. వచ్చే ఎన్నికల్లోపు ఆ పార్టీలో ఎవరూ ఉండరని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

చిత్తూరు: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై జనసేన అగ్రనేత నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు.అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆరోపించారు. పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని విమర్శించారు. అసెంబ్లీకి రాని పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో చెరువులు ఆక్రమించారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం సోమల దగ్గర ఇవాళ(ఆదివారం) ‘‘జనంలోకి జనసేన’’ పేరిట జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో నాగబాబు పాల్గొని వైసీపీ, పెద్దిరెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతి చేసిన వైసీపీ నేతలను జైలుకు పంపిస్తామని నాగబాబు హెచ్చరించారు. వైసీపీ ఖాళీ అయిపోతోంది.. వచ్చే ఎన్నికల్లోపు వైసీపీలో ఎవరూ ఉండరని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెద్దిరెడ్డి వారిని బెదిరించారు..
‘‘పెద్దిరెడ్డిని ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీకి ఎందుకు రాలేదు. పెద్దిరెడ్డి ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి. జగన్ రెడ్డితో పాటు 11మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి. పెద్దిరెడ్డికి ఇక్కడెవరూ భయపడటం లేదు. పెద్దిరెడ్డి అన్యాయాలు, అక్రమాలు అన్నీఇన్నీ కావు. భూకబ్జాలు చేసి మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్లను దగ్థం చేయించారు. తిరుపతిలో చెరువులను ఆక్రమించారు. పాలను తక్కువ ధరకే విక్రయించాలని పాడి రైతులను బెదిరించారు. అటవీశాఖ భూములను ఆక్రమించి ప్రభుత్వ నిధులతో రోడ్లు వేయించారు. వైసీపీలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెట్టాం. కాస్త సమయం ఇచ్చి వైసీపీ మాజీ మంత్రుల భరతం పడతాం. వైసీపీ నేతలు పగటికలలు కంటున్నారు. వైసీపీ ఖాళీ అవుతోంది..విజయసాయిరెడ్డి పార్టీ వదిలి వెళ్లిపోయాడు. వచ్చే ఎన్నికల్లోపు ఏ ఒక్కరూ వైసీపీలో ఉండే అవకాశం లేదు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కాకముందే ఏమీ చేయలేదంటూ వైసీపీ నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదం. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం. పెన్షన్లను ఎలాంటి ఆటంకం లేకుండా ఇస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చాం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా చేశాం. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాం. కర్నూలులో హైకోర్టు బెంజ్ ఏర్పాటు చేస్తున్నాం. అన్న క్యాంటీన్లను ప్రారంభించాం. వైసీపీ నేతలకు కళ్లు కనిపించడం లేదా..? ఏడునెలల్లో మేము చేసిన అభివృద్ధి వైసీపీకి కనిపించలేదా’’ అని నాగబాబు ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...
Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News and Telugu News