Share News

TTD: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు.. భక్తుల రద్దీ ఎలా ఉందంటే

ABN , Publish Date - Jan 19 , 2025 | 07:41 AM

చివరి రోజు కావడంతో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. కేవలం దర్శనం టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ముందుగానే భక్తులకు టోకెన్లు, టికెట్లను కూడా టీటీడీ జారీ చేసింది. గత తొమ్మిది రోజులుగా టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ కల్పిస్తోంది.

TTD: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు.. భక్తుల రద్దీ ఎలా ఉందంటే
Tirumala

తిరుమల: శ్రీవారి (TTD) ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikuntha Dwara Darshans) ఆదివారంతో ముగియనున్నాయి. పదిరోజుల వ్యవధిలో 6 లక్షల 80 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2023-24లో 6 లక్షల 47 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2022 లో 3 లక్షల 78 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగా.. 2020-21లో 4 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. కాగా తిరుమలకు ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. సప్తగిరి టోల్‌ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే సెక్యూరిటీ సిబ్బంది తిరుమలకు పంపుతున్నారు. ఆదివారంతో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం ముగియనుండటంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఈనెల 10 నుంచి 19 వరకు అంటే దాదాపు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను టీటీడీ అధికారులు మూసివేయనున్నారు.


ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. కేవలం దర్శనం టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ముందుగానే భక్తులకు టోకెన్లు, టికెట్లను కూడా టీటీడీ జారీ చేసింది. గత తొమ్మిది రోజులుగా టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో శని, ఆదివారాలకు సంబంధించి 50వేల టోకెన్లను టీటీడీ ముందస్తుగా జారీ చేసింది. అలాగే ఆన్‌లైన్‌లో 15వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా జారీ చేసింది.


రోజుకు 70 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు టీటీడీ ఉద్యోగులకు, వారి కుటుంబసభ్యులకు కూడా ఒక ఉద్యోగికి ఐదు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేసింది. ఆదివారంతో వైకుంఠ ద్వారాలు మూసివేయనున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కేవలం టోకెన్లు, టికెట్లు ఉన్నవారిని వైకుంఠ ద్వార దర్శనం అని టీటీడీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వీరంతా టోకెన్లు, టికెట్లు కలిగిన వారే అని అధికారులు చెబుతున్నారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. భద్రతా సిబ్బంది కూడా తనిఖీలను వేగవంతం చేసి కార్లను తిరుమలకు పంపించి వేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దావోస్‌లో ‘బ్రాండ్‌ ఏపీ’

ఎన్టీఆర్‌ ఘాట్‌ నిర్వహణపై లోకేశ్‌ అసంతృప్తి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 19 , 2025 | 08:35 AM