తుని లెక్క.. తేలింది!
ABN , Publish Date - Feb 25 , 2025 | 01:26 AM
తునిరూరల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో రాజకీయం మరింత రస వత్తరంగా మారింది. తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండో వైస్‌చైర్మన్ ఎన్నిక నాలుగుసార్లు వా యిదాపడిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన నాటకీయ పరిమాణాలతో వైసీపీ గందరగోళంలో పడి పోయింది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ము న్సిపల్ కమిషనర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే తాను మాత్రం సాధారణ కౌన్సిలర్‌గా కొనసాగుతానని కమిషనర్‌కు వెల్ల

వైసీపీకి షాక్
మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి రాజీనామా
కౌన్సిలర్‌గా కొనసాగుతానంటూ వెల్లడి
చేయిజారిపోయిన వైసీపీ కౌన్సిలర్లు
కౌన్సిల్లో బలం తారుమారు
టీడీపీ 16.. వైసీపీ 12 మంది కౌన్సిలర్లు
వైస్‌చైర్మన్ రూపాదేవి సైతం టీడీపీలోకి..
తునిరూరల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో రాజకీయం మరింత రస వత్తరంగా మారింది. తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండో వైస్‌చైర్మన్ ఎన్నిక నాలుగుసార్లు వా యిదాపడిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన నాటకీయ పరిమాణాలతో వైసీపీ గందరగోళంలో పడి పోయింది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ము న్సిపల్ కమిషనర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే తాను మాత్రం సాధారణ కౌన్సిలర్‌గా కొనసాగుతానని కమిషనర్‌కు వెల్లడించారు. తుని మున్సిపాలిటీలో తమకు 18 మంది బలం ఉందని చెబుతూ వచ్చినప్పటికీ సోమవారం చైర్‌పర్సన్ రాజీ నామా కార్యక్రమానికి 15 మంది మాత్రమే రాగా, ముగ్గురు గైర్హాజరయ్యారు. కానీ సాయంత్రానికి అం దులో మరో ముగ్గురు టీడీపీ శిబిరం చెంతకు చేరారు. దాంతో వైసీపీ బలం 12గా ఎంతో తేలిపోయింది. ముందుగానే కౌన్సిల్‌లో తమ బలం పడిపోతోందని ఊహించిన మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కొద్దిరోజులుగా రకరకాల డ్రామాలతో కాలం నెట్టుకొచ్చారు. వైస్ చైర్మన్ ఎన్నికకు రాకుండా ఉద్దేశపూర్వకంగా డ్రామాలకు తెరదీశారు.పైగా టీడీపీ ఈ ఎన్నికలను అడ్డుకుంటున్నట్టు ఎదురుదాడికి దిగా రు. కానీ సోమవారం వారి కున్న బలమెంతో స్పష్టమైపోయింది. అంతకుముందే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఉన్న వైసీసీ కౌన్సిలర్ల తో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి రాజీనామాలు చేయాలని ఒత్తిడి తీసుకువచ్చినట్టు సమాచారం. కానీ కొందరు వైసీపీ కౌన్సిలర్లు తాము రాజీనామాకి సిద్ధం కాలేమని బాంబుపేల్చడంతో వైసీపీ షాక్ గురైంది.
కొత్తగా ఆరుగురు.. టీడీపీ బలం 17
తాజా పరిణామాల నేపథ్యంలో తుని వైసీపీకి చెం దిన మరికొందరు మున్సిపల్ కౌన్సిలర్లు సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే పది మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి రాగా, తాజాగా సోమవారం మరో ఆరుగురు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. వీరిలో ఐదుగురికి మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో 6వ వార్డు కౌన్సిలర్ సూరిశెట్టి సుభద్రాదేవి, 8వ వార్డు కౌన్సిలర్ మంతెన నాగలక్ష్మి, 9వ వార్డు కౌన్సిలర్ వాసంశెట్టి శ్రీను, 10వ వార్డు కౌన్సిలర్ మొ ల్లేటి ప్రభావతి, 21వ వార్డు కౌన్సిలర్ కోలా శ్రీను ఉన్నారు. వైస్‌చైర్‌పర్సన్, 28వ వార్డు కౌన్సిలర్ కుచ్చర్ల పాటి రూపాదేవి హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను కలసి టీడీపీలో లాంఛనంగా చేరారు. వీరి చేరికతో తుని మున్సిపల్ కౌన్సిల్లో తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఓటుతో కలిపితే టీడీపీ బలం 17కి చేరింది.
పరువు దక్కించుకునేందుకే రాజీ‘డ్రామా’
మున్సిపల్ కౌన్సిల్ మూకుమ్మడి రాజీనామాలకు మాజీ మంత్రి దాడిశెట్టి ఆదేశించినప్పటికీ వైసీపీ కౌన్సిలర్లు పెడచెవిన పెట్టడంతో చేసేది లేక పరువు దక్కించుకునే ప్రయత్నాలకు వైసీపీ దిగింది. చైర్‌పర్స న్‌తో రాజీనామా చేయించి బరి నుంచి తప్పించుకు నేందుకు తంటాలు పడింది. టీడీపీ, వైసీపీ బలా బలాల్లో స్పష్టమైన తేడా వచ్చేయడంతో టీడీపీపై నెపం వేసేందుకు రాజా రాజీనామా డ్రామాను తెర ముందుకు తెచ్చారు. అవిశ్వాసం ద్వారా ఎలాగూ పదవీ గండం తప్పదని భావించినట్టు తెలుస్తోంది.
చైర్‌పర్సన్ అటు.. వైస్ చైర్‌పర్సన్ ఇటు
తాజా పరిణామాలతో తుని మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎన్నికలో టీడీపీ గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది. ప్రస్తుతం రాజీనామాతో చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి సాధారణ కౌన్సిలర్‌గా కొనసాగుతారు. వైస్ చైర్‌పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి వైసీపీ వైస్‌చైర్‌పర్సన్ టీడీ పీలో చేరిపోవడంతో ఆమె కొత్త చైర్‌పర్సన్ ఎన్నికయ్యే వరకు బాధ్యతలు నిర్వర్తించే అవకాశమూ ఉంది.
చైర్‌పర్సన్ భర్త వైఖరితోనే..
- టీడీపీ నాయకులు
మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి భర్త వైఖరితోనే వైసీపీ నుంచి కౌన్సిలర్లు బయటకొస్తున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనిగంటి సత్య నారాయణ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. మాజీ మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ కుసుమంచి శోభారాణి మాట్లాడుతూ ప్రస్తుతం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన సుధారాణి పరువు కాపాడుకోవాలనే రాజీ నామాకి సిద్ధపడినట్టు తెలుస్తోందన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు గవర కార్పొరేషన్‌డైరెక్టర్ మల్ల గణేష్, కుక్కడపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.