Palla Srinivasa Rao: వారు నియమావళి దాటి మాట్లాడుతున్నారు... పల్లా శ్రీనివాస్‌రావు షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 23 , 2025 | 05:31 PM
Palla Srinivasa Rao: టీడీపీ కార్యకర్తలకు బ్రాండ్ అంబాసిడర్‌గా లోకేష్ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌రావు తెలిపారు. యువగళం ద్వారా లోకేష్ తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నారని ఉద్ఘాటించారు.

అమరావతి: మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) జన్మదిన వేడుకను ఏపీ టీడీపీ (Telugu Desam Party) కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. లోకేష్ జన్మదిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌రావు (Palla Srinivasa Rao) పాల్గొన్నారు. లోకేష్ జన్మ దినం సందర్భంగా ఎల్లో సింహం పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యత్వం కోటిమందికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి పదవి లోకేష్ చేపట్టిన తర్వాత కార్యకర్తలకు మరింత ధైర్యం వచ్చిందని తెలిపారు. యువగళం ద్వారా లోకేష్ తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నారని పల్లా శ్రీనివాస్‌రావు ఉద్ఘాటించారు.
ఏపీలో ఐదేళ్లలో విద్వేష పాలన కొనసాగిందని విమర్శించారు. ఏ ఒక్కరూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదని అన్నారు. యవగళం పాదయాత్ర సమయంల్లో స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షిస్తామని నారా లోకేష్ (Nara Lokesh) హామీ ఇచ్చారని గుర్తుచేశారు. లోకేష్ హామీ మేరకు కూటమి నేతలంతా కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ప్యాకేజీ తీసుకువచ్చారని చెప్పారు. వైసీపీ హయాంలో కొన ఊపిరితో స్టీల్ ప్లాంట్ కొట్టుమిట్టాడిందని చెప్పారు. కొన ఊపిరితో ఉన్న స్టీల్ ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ ఎంతగానో ఉపయోగ పడుతుందని పల్లా శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు.
టీడీపీ కార్యకర్తలకు బ్రాండ్ అంబాసిడర్‌గా లోకేష్ ఉన్నారని చెప్పారు. 15 సెకండ్లలో ఒక మెంబర్ షిప్ చేయగలుగుతున్నామని ప్రకటించారు. డిప్యూటీ సీఎం పదవికి టీడీపీలో ఒక నియమావళి ఉందన్నారు. కొంత మంది నియమావళి దాటి మాట్లాడుతున్నారని చెప్పారు. వైసీపీ (YSRCP) నేతలు కూటమిలో ఉన్న మూడు పార్టీలను విడదీయాలని కాలకేయులులాగా చూస్తున్నారని ఆక్షేపించారు. కూటమి నేతలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని పల్లా శ్రీనివాస్‌రావు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News