AP Politics: వైసీపీ కుట్రలకు చెక్.. కూటమి నేతల విజయం..
ABN , Publish Date - Jan 22 , 2025 | 09:27 AM
ఏపీలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలకు పాల్పడిందా.. నాయకుల మధ్య విబేధాలు ఉన్నాయనే అసత్య ప్రచారాన్ని విస్తృతం చేయడం ద్వారా ప్రజల్లో అపోహాలు సృష్టించేందుకు ప్రయత్తనిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఏపీలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలకు పాల్పడుతోందా.. నాయకుల మధ్య విబేధాలు ఉన్నాయనే అసత్య ప్రచారాన్ని విస్తృతం చేయడం ద్వారా ప్రజల్లో అపోహాలు సృష్టించేందుకు ప్రయత్తనిస్తోందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రజలు తమపై ఎంత వ్యతిరేకంగా ఉన్నారో వైసీపీకి తెలిసొచ్చినట్లైంది.
అధికారంలో ఉన్నంతసేపు తాము చేసేదే కరెక్ట్ అనుకున్న నేతలు.. తమ తప్పులను సరిదిద్దుకోకపోవడంతోనే ఓడిపోయామనే సత్యాాన్ని గ్రహించకుండా.. ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకున్న కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం ద్వారా రాజకీయలబ్ధి పొందాలనే ఉద్దేశంతో వైసీపీ ముందుకెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలి, మంత్రి మండలిలో ఎవరుండాలి, ఏ శాఖలు ఎవరికి కేటాయించాలనేవి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అంతర్గత విషయం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది ప్రజలకు సంబంధించిన అంశం. కానీ వైసీపీ మాత్రం కూటమి పార్టీల అంతర్గత అంశాలను పెద్ద సమస్యలగా చూపిస్తూ.. కూటమిలో సఖ్యతలేదనే భావాన్ని ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈక్రమంలో వైసీపీ అసత్య ప్రచారానికి, కుట్రలకు కూటమి పార్టీలు ఆదిలోనే బ్రేకులు వేయడంతో వైసీపీ నేతలకు ఏమి చేయాలో తోచడంలేదట.
డిప్యూటీ సీఎం అంశంపై..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తపర్చారు. పొలిట్‌బ్యూరోలో ప్రస్తావించాల్సిన అంశాన్ని కొందరు నాయకులు బహిరంగంగా మాట్లాడటంతో టీడీపీలో మరికొంతమంది ఈ డిమాండ్‌కు మద్దతు పలికారు. అయితే టీడీపీ అధిష్టానం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో ఇలాంటి ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని శ్రేణులకు సూచించారు. జనసేన సైతం డిప్యూటీ సీఎం, సీఎం విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని జనసైనికులకు సూచించింది. దీంతో వైసీపీ అసత్య ప్రచారానికి కూటమి పార్టీలు బ్రేకులు వేసినట్లైంది. పార్టీ అంతర్గత అంశాలనే వైసీపీ తన రాజకీయలబ్ధికి ఉపయోగించుకోవడంతో పాటు, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందనే విషయాన్ని గ్రహించడంతోనే టీడీపీ, జనసేన అధిష్టానం పార్టీ శ్రేణులకు ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
స్పందించిన లోకేశ్..
ఏపీ మంత్రి నారా లోకేశ్ సైతం డిప్యూటీ సీఎం ప్రచారాంపై తొలిసారి స్పందించారు. దావోస్ పర్యటనలో ఉన్న లోకేశ్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు చేతినిండా పని ఉందని చెప్పుకొచ్చారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావల్సి ఉందని, సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవల్సిన అవసరం ఉందన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here