Share News

Deputy CM Pawan Kalyan : కేంద్ర బడ్జెట్‌తో సమ్మిళిత అభివృద్ధి సాకారం

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:20 AM

కేంద్ర ప్రభుత్వ సమున్నత దృక్పథం బడ్జెట్లో కనిపించింది’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Deputy CM Pawan Kalyan : కేంద్ర బడ్జెట్‌తో సమ్మిళిత అభివృద్ధి సాకారం

రాష్ట్రానికి కొనసాగిన అండదండలు: డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘దేశ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం. ఈ బడ్జెట్‌ మన దేశాన్ని వికసిత్‌ భారత్‌ వైపు నడిపించేలా ఉంది. రాజకీయ అవసరాల కంటే దేశం, ప్రజలు ముఖ్యమనే కేంద్ర ప్రభుత్వ సమున్నత దృక్పథం బడ్జెట్లో కనిపించింది’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రధాని మోదీ ఇస్తున్న అండదండలు కేంద్ర బడ్జెట్లోనూ కొనసాగిందని తెలిపారు. ‘పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం మూలంగా రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. పోలవరం ప్రాజెక్టుకి రూ.5,936 కోట్లు, బ్యాలెన్స్‌ గ్రాంటుగా రూ.12,157 కోట్లు ప్రకటించడం శుభపరిణామం. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది. విశాఖ ఉక్కు పరిశ్రమకి రూ.3,295 కోట్లు కేటాయించడం ద్వారా ఆ ప్లాంట్‌ పరిరక్షణకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి సృష్టంచేశారు. విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు నిధులు ఇవ్వడం ద్వారా పోర్టు సామర్థ్యం పెరుగుతుంది. 2019-24 మధ్య రాష్ట్రం పాలనపరమైన, ఆర్థికపరమైన విధ్వంసాన్ని అనుభవించింది. ఆ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడుతున్న తరుణంలో రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు ధన్యవాదాలు’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. కాగా, సామాన్యులకు, రైతులకు వెన్నుదన్నుగా నిలిచేలా కేంద్ర బడ్జెట్‌ ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు.


Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 02 , 2025 | 04:20 AM