Share News

EX MP Vijay Sai Reddy : క్యారెక్టర్‌ ఉంది.. భయం లేదు!

ABN , Publish Date - Feb 08 , 2025 | 02:55 AM

జగన్‌ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ‘నేను ప్రలోభాలకు లొంగలేదు.

EX MP Vijay Sai Reddy : క్యారెక్టర్‌ ఉంది.. భయం లేదు!
YS Jagan

  • అందుకే ఎవరికీ లొంగలేదు: సాయురెడ్డి

  • జగన్‌తోపాటు కేసు పెట్టినప్పుడే భయపడలేదు: మోపిదేవి

  • జగన్‌ వ్యాఖ్యలకు‘మాజీల’ కౌంటర్‌

అమరావతి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ‘నాయకుడికి క్యారెక్టర్‌, క్రెడిబులిటీ ఉండాలి. సాయిరెడ్డికైనా, ఇంకెవరికైనా ఇదే వర్తిస్తుంది’ అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ‘నేను ప్రలోభాలకు లొంగలేదు. నాకు భయం లేదు’ అని ‘ఎక్స్‌’ వేదికగా స్పష్టం చేశారు. ‘‘వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్‌ ఉన్నవాడిని. అందుకే ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకీ లొంగలేదు. భయం అనేది నా అణువు అణువులోనూ లేదు. కాబట్టే రాజ్యసభ పదవి, పార్టీ పదవులు, రాజకీయాలనే వదులుకున్నా’’ అని తెలిపారు.

నేనేంటో ప్రజలకు తెలుసు: మోపిదేవి

‘‘మేము ప్రలోభాలకు లొంగేవాళ్లం, భయపడేవాళ్లం అవునో, కాదో నా నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. అంతకంటే ముందు జగన్‌కు కూడా తెలుసు. నాకు కొత్తగా సర్టిఫికెట్‌ అవసరం లేదు’’ అని మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఒకవేళ భయపడే వాడినైతే జగన్‌తో పాటు కేసులో పెట్టినప్పుడే పారిపోయే వాడినన్నారు. ‘‘అన్నింటికీ తట్టుకుని ఆ రోజు నిలబడ్డా. ప్రలోభాలకు, ఒత్తిడికి లొంగి రాజకీయం చేయడం, రాజీనామాలు చేయడం అనే ఆరోపణలు అర్థ రహితం. భయపడే తత్వం నా రక్తంలోనే లేదు’’ మోపిదేవి తెలిపారు.


ఇప్పుడు అప్యాయత... తర్వాత అత్యాచారం!

  • సాకే నిర్ణయం బాధాకరం: డొక్కా

వైసీపీలో విలువలు ఉండవు.. అది ఒక దుర్మార్గపు పార్టీ అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ధ్వజమెత్తారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్‌ వైసీపీలో చేరడంపై ఆయన స్పందించారు. ‘‘పార్టీలో చేరేటప్పుడు ఆప్యాయంగా మాట్లాడతారు. ఆ తర్వాత రాజకీయంగా అత్యాచారం చేస్తారు. ఇప్పటికే ఆ పార్టీలో చేరిన 74మంది దళితుల విషయంలో అదే జరిగింది. అభ్యుదయ భావాలు కలిగిన శైలజానాథ్‌ దళిత వ్యతిరేక భావాలు కలిగిన వైసీపీలో చేరడం బాధాకరం’’ అని అన్నారు. వైసీపీ నేతలు మొదట మనిషిలా మాట్లాడతారని... ఆ తర్వాత చంపి తినేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉన్న ఆంధ్రా శశికళకు దళితులు అంటే అసలు పడదన్నారు. గతంలో తాను కూడా వైసీపీ వారి మాటలు విని ఆ పార్టీలో చేరి మోసపోయానని డొక్కా ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం

Updated Date - Feb 08 , 2025 | 10:45 AM