Minister Anitha: గంజాయి రవాణాపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jan 04 , 2025 | 03:02 PM
చిన్న, చిన్న పిల్లలు కూడా గంజాయి మత్తులో విచక్షణరహితంగా వ్యవహరిస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణా, గంజాయి సాగు లేకుండా ఈగల్ యాక్షన్ టీం రంగంలోకి దిగిందని అన్నారు. టెక్నాలజీ కూడా ఉపయోగించి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

అనకాపల్లి జిల్లా ( సబ్బవరం): గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను హోం మంత్రి వంగలపూడి అనిత (Minister Anitha) ఆదేశించారు. సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో ఆకస్మికంగా హోం మంత్రి వంగలపూడి అనిత ఇవాళ(శనివారం) తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి హోం మంత్రి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి, రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని పోలీసులకు హోం మంత్రి అనిత సూచించారు.
ALSO READ: CM Chandrababu: చిత్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారు..
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలి..
అంతకుముందు సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గండి బాజ్జి పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి హోం మంత్రి అనిత భోజనం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారన్నారు. ‘‘మా నాన్న క్రమశిక్షణతో ముందుకు నడిపించారు. మా నాన్న మాకు ఇచ్చిన ఆస్తి చదువు. ఆ చదువే రాజకీయాల్లో నాకు పెట్టుబడి అయింది’’ అని హోంమంత్రి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అంటే ఎంతో కొంత చిన్న చూపు ఉంటుందని అన్నారు. పుస్తకాలు విలువ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలుసు అని చెప్పారు. చిన్న, చిన్న పిల్లలు కూడా గంజాయి మత్తులో విచక్షణరహితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణా, గంజాయి సాగు లేకుండా ఈగల్ యాక్షన్ టీం రంగంలోకి దిగిందని అన్నారు. టెక్నాలజీ కూడా ఉపయోగించి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. సబ్బవరం జూనియర్ కాలేజ్‌లో చిన్న, చిన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.
విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు: మంత్రి అనగాని సత్య ప్రసాద్
బాపట్ల జిల్లా : జూనియర్ కాలేజీల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు.నాణ్యమైన విద్యను అందించేందుకు మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నారని అన్నారు. గతంలో బడి పిలుస్తుంది పేరుతో విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి సీఎం చంద్రబాబు ఈ రంగానికి ఎంతో ఖర్చు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు చుట్టూ మంచి వాతావరణం ఉండటం కూడా అవసరమని తెలిపారు . అటువంటి వాతావరణాన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ జోలికి వెళ్లవద్దని అన్నారు. విద్యార్థులను సక్రమమైన మార్గంలో నడిపించేందుకే పేరంట్ టీచర్స్ మీటింగ్‌లను నిర్వహిస్తున్నామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vijayawada: నేటి నుంచే ఆ పథకం స్టార్ట్.. ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్..
Atchannaidu: వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీ
AP Ministers: తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులపై మంత్రులు ఏమన్నారంటే..
Read Latest AP News And Telugu news