L and T chairman: వారానికి 90 పనిగంటల తర్వాత.. మరోసారి L&T ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:00 PM
L and T chairman Subramanian: ఎల్ అండ్ టి ఛైర్మన్ సుబ్రమణియన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారానికి 90 పని గంటలు అంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలపాలైన ఆయన.. వివాదం ఇంకా అందరూ మరువకముందే మరో సంచల ప్రకటన చేసి వార్తల్లోకి ఎక్కారు.

L and T chairman Subramanian Viral Comments : ఎల్ అండ్ టి ఛైర్మన్ సుబ్రమణియన్ మరలా వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించారు. కొన్నిరోజుల క్రితం భార్యను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు. దేశం అభివృద్ధి చెందాలంటే వారానికి 90 గంటలు పనిచేయాలి అని సంచలన వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ సంగతి అంతా మరిచిపోకముందే మరో మారు వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చకు తెరలేపారు.
సంక్షేమ పథకాల వల్లే కార్మికుల పనిచేయట్లేదు : L&T ఛైర్మన్
చెన్నైలో జరిగిన CII శిఖరాగ్ర సమావేశంలో S.N. సుబ్రమణియన్ మాట్లాడుతూ, “L&T కంపెనీలో 2.5 లక్షల మంది ఉద్యోగులు, దాదాపు 4 లక్షల మంది నిర్మాణ కార్మికులను పనిచేస్తున్నారు. ఉద్యోగులు మా కంపెనీని వదిలి వెళ్లినా లేదా కొంతమంది ఉద్యోగులను తొలగించినా అవన్నీ పెద్దగా ప్రభావితం చేయవు. కానీ ఇటీవల నిర్మాణ రంగంలో కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రస్తుతం నిర్మాణ కార్మికులు పని కోసం వలస వెళ్ళడానికి ఇష్టపడటంలేదు. దీనికి ఒక కారణం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు. చాలా మంది కార్మికులకు వారు ఉన్న చోటనే సంపాదిస్తున్నట్లున్నారు. అందుకే వలస వెళ్లడం లేదు. అందుకే ఈ రోజుల్లో నిర్మాణ కార్మికులను నియమించుకోవడం కష్టంగా మారింది.“ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వైట్ కాలర్ ఉద్యోగుల్లోనూ ఇదే మనస్తత్వం..
ఈ మనస్తత్వం బ్లూ కాలర్ కార్మికులలో మాత్రమే ఉంటుందని చెప్పలేము. వైట్ కాలర్ కార్మికులకు కూడా ఉండవచ్చు. నేను L&Tలో ఇంజనీర్‌గా చేరినప్పుడు, నా బాస్, “నువ్వు చెన్నై వాడివైతే, వెళ్లి ఢిల్లీలో పని చేయి” అని అన్నారు. కానీ ఈ రోజుల్లో నేను ఒక ఉద్యోగికి అలా చెబితే అతడు 'బై' చెప్పి వెళ్లిపోతాడు. నేటి పని సంస్కృతి మారిపోయింది. ఉద్యోగులకు అనుగుణంగా HR విధానాలను మార్చాల్సిన పరిస్థితిలో ఉన్నాం" అని ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
గతంలో ఎస్.ఎన్. సుబ్రమణియన్ పనిగంటల గురించి చర్చిస్తూ "ఆదివారాలు మిమ్మల్ని పని చేయించలేకపోయినందుకు నేను చింతిస్తున్నాను. ఎందుకంటే నేను ఆదివారాలు పని చేస్తాను. ఆదివారాలు ఇంటి దగ్గర భార్య ముఖం ఎంతసేపు చూస్తూ ఉంటారు? భార్య తన భర్త ముఖాన్ని ఎంతసేపు చూస్తూ ఉండగలదు? ఆఫీసుకు వచ్చి పని చేయండి. ప్రపంచంలో నంబర్‌వన్‌గా ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి" అని వ్యాఖ్యానించి వివాదాన్ని రేకెత్తించారు.
ఇవి కూడా చదవండి..
Terror Threat Call: ప్రధాని ప్రయాణ విమానంపై ఉగ్రదాడి బెదిరింపు కాల్.. తర్వాత ఏమైందంటే..
Prashant Kishore: టీవీకే నేతలతో పీకే భేటీ.. అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చ
Teachers: ‘కీచక టీచర్ల’ చిట్టా సిద్ధం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..