Share News

Business Ideas : ఈ పంట ఒక్కసారి వేస్తే చాలు.. రిస్క్ ఉండదు.. ఏడాది పొడుగునా రెట్టింపు లాభాలు..

ABN , Publish Date - Feb 20 , 2025 | 06:07 PM

Business Ideas : సాధారణంగా ప్రతి రైతు ఎదుర్కొనే ప్రధాన సమస్య. పండించిన పంటను మార్కెట్ చేసుకోలేక పోవడం లేదా పంట చేతికొచ్చే సమయానికి డిమాండ్ పడిపోవడం. దీనికి తోడు అకాల వర్షాల బాధలు ఉండనే ఉంటాయి. అందుకే ఏ పంట వేయాలా అనే సందేహం ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. కానీ, వ్యవసాయదారులు ఒక్కసారి ఈ పంట వేస్తే చాలు. పెద్దగా రిస్క్ లేకుండానే ఏటా రెట్టింపు లాభాలు అందుకోవచ్చు.

Business Ideas : ఈ పంట ఒక్కసారి వేస్తే చాలు.. రిస్క్ ఉండదు.. ఏడాది పొడుగునా రెట్టింపు లాభాలు..
Low Investment Business Idea At Home

Business Ideas : ఇది వరకటితో పోలిస్తే ప్రస్తుతం వ్యవసాయం చేయడం చాలా సులభతరంగా మారింది. అందుకే కరోనా తర్వాత చాలామంది లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదులుకుని మరీ టెక్ సాగు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక పరికరాలను సరిగ్గా వినియోగించడం తెలిస్తే ఈ రంగంలో ఉన్నంత ఆదాయం ఇంకెక్కడా దొరకదు. పంట పండించడమే తప్ప మార్కెటింగ్ చేతకాక చాలామంది రైతన్నలు దళారుల చేతిలో మోసపోతుంటారు. ఈ పంట ఒక్కసారి వేశారంటే ఏ సీజన్‌లో అయినా కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పక చేతికొస్తుంది. వర్షం ఎక్కువగా కురిసినా.. తక్కువగా కురిసినా అస్సలు ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పల్లెల్లో ఉండే నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం.


ఏడాది పొడవునా ఈ పంటకు డిమాండ్..

పెద్ద చదువులు చదివినా నేటితరం వ్యవసాయం చేసేందుకు మొహమాటం పడటం లేదు. నైన్ టూ ఫై ఉద్యోగాల కంటే ఒత్తిడి లేకుండా సొంతూళ్లో తల్లిదండ్రుల వద్దే ఉంటూ సాగు చేసుకోవాలని భావిస్తున్నారు. స్మార్ట్ వ్యవసాయం చేస్తూ తోటివారు ఈ రంగంవైపు అడుగులు వేసేలా స్ఫూర్తి నింపుతున్నారు. పంటలు ఎంచుకోవడంలో చూపించే నేర్పరితనమే వారి విజయానికి ప్రధానకారణం. అలాంటివాటిలో మునగ సాగు (Drumstick Farming) కూడా ఒకటి. ఆరోగ్యానికి మునగ కాయలతో పాటు ఆకులు ఎంతో మేలు చేస్తాయి. నగరాలు, పట్టణాల్లో ఏడాది పొడవునా వీటికి మంచి డిమాండ్ ఉంది.

Munaga.jpg


పెట్టుబడికి మూడింతల లాభాలు..

మునగ శాస్త్రీయ నామం మోరింగా ఒలిఫెరా. ఈ చెట్టులోని ప్రతి భాగం అమూల్యమైనదే. ఇది ఆహారంగా మాత్రమే కాదు. ఆయుర్వేదపరంగానూ ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరో ప్రత్యేక ఏంటంటే, దీన్ని బంజరు నేలలో కూడా సాగు చేయవచ్చు. ఒక్కసారి నాటామంటే నాలుగేళ్ల పాటు పొలాన్ని దున్నాల్సిన అవసరం రాదు. పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. విత్తి వదిలేస్తే చాలు. పుష్కలంగా ఏడాది పొడవునా కాపు వస్తూనే ఉంటుంది. మునగఆకులు, కాయలను నిత్యం తినేవారు ఉండటంతో మార్కెట్లో డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. పంటల మధ్యలో వేసుకున్నా నెలకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. పూర్తి స్థాయిలో అంటే ఒకటి లేదా అరెకరాలో సాగు చేసినా చాలు. పెట్టిన పెట్టుబడికి మూడింతల లాభాలు తప్పక చేతికొస్తాయి.

Updated Date - Feb 20 , 2025 | 06:10 PM