Share News

JNTU: సరిపోదు.. ఒక శనివారం.. మరో వారం కూడా సెలవు ఇవ్వాలని జేఎన్‌టీయూ సిబ్బంది వినతి

ABN , Publish Date - Feb 21 , 2025 | 09:55 AM

జేఎన్‌టీయూ(JNTU)కు, వర్సిటీకి అనుబంధంగా ఉన్న 8 కళాశాలలకు ప్రతినెలా రెండవ శనివారంతో పాటు 4వ శనివారాన్ని కూడా సెలవుదినంగా ప్రకటించాలని కొత్త వీసీని సిబ్బంది కోరారు.

JNTU: సరిపోదు.. ఒక శనివారం.. మరో వారం కూడా సెలవు ఇవ్వాలని జేఎన్‌టీయూ సిబ్బంది వినతి

- స్పందించిన వీసీ

- 4వ శనివారం కూడా సెలవిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)కు, వర్సిటీకి అనుబంధంగా ఉన్న 8 కళాశాలలకు ప్రతినెలా రెండవ శనివారంతో పాటు 4వ శనివారాన్ని కూడా సెలవుదినంగా ప్రకటించాలని కొత్త వీసీని సిబ్బంది కోరారు. దీనిపై కిషన్‌కుమార్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు. 4వ శనివారం కూడా సెలవిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతం(2008)లో రద్దు చేసిన సెలవుల విధానాన్ని మళ్లీ పునరుద్ధరించారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో వీసీ కిషన్‌కుమార్‌ రెడ్డి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ..

ఈ వార్తను కూడా చదవండి: Civil Services Exam: సివిల్స్ ఎగ్జామ్ దరఖాస్తు దారులకు గుడ్ న్యూస్.. చివరి తేదీ మళ్లీ పొడిగింపు..


జేఎన్‌టీయూకు ప్రత్యేకంగా ఉండే కొన్ని విధానాలను ఇంతకు మునుపు పనిచేసిన కొందరు వీసీలు రద్దు చేశారని, తాను స్వయంగా జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ను కావడంతో వర్సిటీ ప్రత్యేకతకు భంగం వాటిల్లకుండా, పాత విధానాలను కొన్నింటిని తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. 4వ శనివారం సెలవు ఇచ్చినందున, మిగిలిన రోజుల్లో పనివేళలను పెంచుతామని చెప్పారు. అలాగే కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌లకు మాత్రమే ప్రాధాన్యత కాకుండా నిర్లక్ష్యానికి గురవుతున్న కోర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను బతికించేందుకు కృషిచేస్తానని వైస్‌ చాన్స్‌లర్‌ కిషన్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

city7.jpg


నేను 65 ఏళ్ల ఆపర్చునిటీ మిస్సయ్యాను

జేఎన్‌టీయూ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన కిషన్‌ కుమార్‌రెడ్డి వర్సిటీకి నూతన వీసీగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఆ విభాగాన్ని గురువారం సాయంత్రం సందర్శించారు. తమ విభాగానికి చెందిన సీనియర్‌ ప్రొఫెసరే.. తమకు వీసీగా రావడంతో ఆయనను తోటి ప్రొఫెసర్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ప్రొఫెసర్‌ ఇందిరా రాణి మాట్లాడుతూ.. ‘వీసీ గారూ.. 16 ఏళ్లుగా మేం 4వ శనివారం సెలవుదినాన్ని కోల్పోయాం. మీరు దాన్ని తిరిగి పునరుద్ధరించడం సంతోషంగా ఉంది’ అన్నారు. వీసీ కిషన్‌కుమార్‌ రెడ్డి స్పందిస్తూ.. నేను ప్రొఫెసర్‌గా పనిచేస్తూ 60ఏళ్లకే పదవీ విరమణ చేశానని, ప్రభుత్వం మీకు కల్పించిన 65ఏళ్ల అవకాశాన్ని మిస్సయ్యానని చమత్కరించారు.


ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట

ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా

ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్‌ గురుదక్షిణ

ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2025 | 09:55 AM