Jets Crash: ఢీకొన్న రెండు విమానాలు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
ABN , Publish Date - Feb 11 , 2025 | 07:28 AM
ఒక ప్రైవేట్ జెట్ విమానం, ఆగి ఉన్న మరో విమానాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని ఇక్కడ చూద్దాం.

అమెరికా (america) అరిజోనా(arizona)లోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడినట్లు సమాచారం అందింది. ఈ ప్రమాదం ఒక ప్రైవేట్ జెట్ విమానం రన్‌వేపై నుంచి అదుపుతప్పి, మరో జెట్‌ను ఢీకొన్న క్రమంలో జరిగింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రాథమిక నివేదిక ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో లియర్‌జెట్ 35A అనే ఒక ప్రైవేట్ జెట్ విమానం రన్‌వేపై దిగాక, అనుకోకుండా అదుపు తప్పి పక్కకు వెళ్లింది.
భయాందోళన..
ఆ సమయంలో ర్యాంప్‌పై ఆగిన గల్ఫ్‌స్ట్రీమ్ 200 బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది. రెండు విమానాలు ఢీకొనడంతో భారీ శబ్దం వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో విమానాశ్రయంలో విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. స్కాట్స్‌డేల్ విమానాశ్రయం ఒక ప్రముఖ ప్రైవేట్ విమానాశ్రయంగా ఉంది. ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు శబ్దానికి ఒక్కసారిగా భయాందోళన చెందారు. సమాచారం తెలుసుకున్న FAA అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.
నాల్గో ప్రమాదం..
అయితే ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుల సంఖ్య గురించి పూర్తి సమాచారం లేదు. కానీ సమాచారం అందిన ప్రకారం ఒకరు మరణించారని, పలువురు గాయపడ్డారని తెలుస్తోంది. ఇది గత 10 రోజుల్లో అమెరికాలో జరిగిన నాల్గో విమాన ప్రమాదం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో అమెరికాలో విమాన ప్రమాదాలు పెరుగుతున్నట్లుగా పలు నివేదికలు చెబుతున్నాయి. విమానయాన రంగంలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలు, విమాన టెక్నాలజీ లోపాలు వంటి కారణాలు ఈ ప్రమాదాలకు దారితీస్తున్నట్లు సూచించబడింది. ఈ నేపథ్యంలో FAA, అమెరికా మంత్రిత్వ శాఖ విమాన భద్రత ప్రమాణాలను మెరుగుపరచడం కోసం చర్యలు తీసుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Gold and Silver Rates Today: రెండు వేలకుపైగా పెరిగిన గోల్డ్.. వెండి ధర ఎలా ఉందంటే..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Read More Business News and Latest Telugu News