Hero Vijay: టీవీకేలో అనుబంధ విభాగాలు.. ప్రకటించిన అధ్యక్షుడు విజయ్
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:00 PM
హీరో విజయ్(Hero Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) బలోపేతంలో భాగంగా కొత్తగా 28 అనుబంధ విభాగాలను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

చెన్నై: హీరో విజయ్(Hero Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) బలోపేతంలో భాగంగా కొత్తగా 28 అనుబంధ విభాగాలను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే రెండో యేడాదిలోకి అడుగుపెట్టిన టీవీకేను 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై విజయ్ దృష్టిసారించారు. ఇందులో భాగంగా తాజాగా 28 అనుబంధ విభాగాలను ఏర్పాటు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయిన పాక్ సైన్యం.. తగిన శాస్తి చేసిన భారత్..
ఇప్పటిరకు ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా హిజ్రాలకు కూడా ఓ విభాగాన్ని టీవీకేలో ఏర్పాటు చేయడం గమనార్హం. ఆ పార్టీ విభాగాలను ఓసారి పరిశీలిస్తే మీడియా వింగ్‌తో పాటు ఐటీ, న్యాయవాదులు, ప్రచార, ప్రతినిధులు, సభ్యత్వ నమోదు , శిక్షణ, కార్యకర్తల నైపుణ్య అభివృద్ధి, పర్యావరణం, హిస్టరీ, రీసెర్స్, ఇన్ఫర్మేషన్, హిజ్రాల వింగ్, దివ్యాంగులు, యువజన, విద్యార్థి, మహిళలు, యువతులు, చిన్నారులు, కార్యకర్తలు, వ్యాపారులు, జాలర్లు, చేనేత కార్మికులు, పదవీ విరమణ, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, వైద్యం, రైతులు, సాంఘిక, సంస్కృతి, సాంప్రదాయం, స్వచ్చంధకారులు, అఖిల భారత దళపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కం వంటి మొత్తం 28 విభాగాలను ఏర్పాటు చేశారు. ఈ జాబితాను భారత ఎన్నికల సంఘానికి టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ సారథ్యంలోని టీవీకే బృందం సమర్పించనుంది.
టీవీకేకు 20 శాతం ఓటు బ్యాంకు?
ఇటీవలే ఆవిర్భవించిన టీవీకేకు రాష్ట్రంలో 20 శాతం ఓటు బ్యాంకు వుందంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kishore) నివేదిక సమర్పించారని, సామాజిక మాధ్యమాల్లో విస్త్రత ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని రాజకీయ విశ్లేషకులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. స్థాపించి ఏడాది కూడా కాని పార్టీకి అంత ఓటు బ్యాంకు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. సీనియర్ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ పేరుతో టీవీకే నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన
ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు
ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర
ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ
Read Latest Telangana News and National News