Share News

Court: భార్యతో ఇష్టం లేకుండా అసహజ శృంగారం నేరం కాదు.. కోర్టు సంచలన తీర్పు

ABN , Publish Date - Feb 12 , 2025 | 08:32 AM

ఓ మహిళ తన భర్తతో బలవంతంగా అసహజ లైంగిక చర్యకు పాల్పడినట్లు తెలిపింది. ఆ తర్వాత మహిళ మరణించింది. ఈ కేసులో ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Court: భార్యతో ఇష్టం లేకుండా అసహజ శృంగారం నేరం కాదు.. కోర్టు సంచలన తీర్పు
Chhattisgarh high Court

భార్యతో లైంగిక సంబంధం విషయంలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (Chhattisgarh High Court) సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలో భార్యకు ఇష్టం లేకుండా తనతో అసహజ శృంగారం లాంటివి చేయడాన్ని నేరంగా భావించలేమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు సోమవారం (ఫిబ్రవరి 10, 2025) ఈ వ్యాఖ్యలు చేసింది. లైంగిక సంబంధం లేదా అసహజ శృంగారం విషయంలో భార్య 'సమ్మతి' లేదని నేరంగా పరిగణించలేమని జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది.


15 ఏళ్లకు మించి ఉంటే..

భార్య వయస్సు 15 ఏళ్లకు మించి ఉన్నట్లైతే, ఆమెతో లైంగిక సంబంధం విషయంలో భర్తపై అత్యాచారం లేదా అసహజ లైంగిక చర్య కింద నేరం మోపడం సబబు కాదని కోర్టు తెలిపింది. ఈ తీర్పులో భార్య సమ్మతి లేనప్పటికీ, భర్తపై నేరం మోపడం అసంబద్ధమని కోర్టు చెప్పింది. అంగీకారం లేకపోయినా, భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరం కాదని వెల్లడించింది.


ఈ కేసు నేపథ్యం

అయితే ఈ కేసు 2017 డిసెంబర్ 11న జరిగిన ఘటన ఆధారంగా నమోదైంది. ఒక వ్యక్తి తన భార్యతో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అసహజ లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఆ మహిళను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె మరణించింది. అయితే వైద్యులు ఆమె మరణానికి అసహజ లైంగిక శృంగారమే కారణమని చెప్పుకొచ్చారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. బస్తర్ జిల్లా జగదల్పూర్ నివాసి అయిన ఆ వ్యక్తిని డిసెంబర్ 11, 2017న ప్రభుత్వ ఆసుపత్రిలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆ క్రమంలో భార్య వాంగ్మూలం ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. భర్త "బలవంతపు లైంగిక సంబంధం" కారణంగా అనారోగ్యానికి గురయ్యారని ఆమె తెలిపింది.


నెటిజన్ల కామెంట్లు

దీంతో ఫిబ్రవరి 11, 2019న జగదల్‌పూర్‌లోని అదనపు సెషన్స్ జడ్జి ఆ వ్యక్తిని దోషిగా నిర్ధారించి, 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. ఆ వ్యక్తి తరువాత దిగువ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ వ్యక్తి బిలాస్‌పూర్‌లోని హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 377 (అసహజ లైంగిక చర్యలు) కింద నేరం అభియోగాలను హైకోర్టు సమర్థించలేదు. ప్రస్తుతం ఈ తీర్పు చర్చనీయాంశంగా మారింది. అసహజ లైంగిక సంబంధం విషయంలో మహిళ మరణించినా కూడా తీర్పు ఇలా ఇస్తారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ తీర్పు విషయంలో మళ్లీ ఓసారి రివ్యూ చేయాలని అనేక మంది కోరుతున్నారు. మరోవైపు ఇంకొంత మంది మాత్రం ఈ తీర్పును సమర్థిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Narendra Modi: ఇన్వెస్ట్ మెంట్స్ గురించి మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇదే సరైన సమయమని వెల్లడి


New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

EPFO: ఈ వినియోగదారులకు అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా లేదా..

Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్‌ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..


Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 12 , 2025 | 09:56 AM