Delhi CM Rekha Gupta: వైరల్ అవుతున్నఢిల్లీ సీఎం 30 ఏళ్ల నాటి ఫొటో.. షేర్ చేసిన కాంగ్రెస్ నేత..
ABN , Publish Date - Feb 20 , 2025 | 01:10 PM
Delhi CM Rekha Gupta: ఢిల్లీ సీఎంగా ఎంపికైన సందర్భంగా రేఖా గుప్తాను అభినందిస్తూ కాంగ్రెస్ నేత అల్కా లాంబా ఓ ఫొటో షేర్ చేశారు. ఈ ఇద్దరూ నేతలు కలిసి ఉన్న 30 ఏళ్ల క్రితం నాటి ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Delhi CM Rekha Gupta : ఎన్నికల ఫలితాల వెలువడిన 11 రోజుల తర్వాత సస్పెన్స్‌కు తెరదించుతూ నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ప్రకటించింది బీజేపీ అధిష్ఠానం. దీంతో రేఖాగుప్తా ఎవరా అన్న చర్చ అందరిలో మొదలైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత అల్కా లాంబా కొత్త ఢిల్లీ సీఎంకు శుభాకాంక్షలు చెప్తూ రేఖా గుప్తా 30 ఏళ్ల క్రితం నాటి ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. విద్యార్థి నేతలుగా ఇద్దరు కలిసి ప్రమాణస్వీకారం చేస్తున్న ఆ పాత ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
30 ఏళ్ల నాటి చిరస్మరణీయ క్షణాలవి : అల్కా లాంబా
రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ప్రకటించిన వెంటనే, అల్కా లాంబా సోషల్ మీడియాలో ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. అల్కా లాంబా, రేఖ గుప్తా కలిసి ఉన్న ఈ ఫోటో దాదాపు 30 సంవత్సరాల నాటిది. NSUI నుంచి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా అల్క, ABVP నుంచి ప్రధాన కార్యదర్శిగా రేఖ ఎన్నికైన సందర్భంలో తీసుకున్న ఫొటో. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ 'రేఖా గుప్తా, నేను కలిసి ప్రమాణస్వీకారం చేసిన 1995 నాటి చిరస్మరణీయ ఫోటో ఇది. ఢిల్లీకి నాల్గవ మహిళా ముఖ్యమంత్రిగా ఎంపికైనందుకు రేఖ గుప్తాకు అభినందనలు మరియు శుభాకాంక్షలు. ఇకనుంచైనా యమునా తల్లి పరిశుభ్రంగా ఉంటుందని.. కుమార్తెలు సురక్షితంగా ఉంటారని ఢిల్లీ వాసులను ఆశిస్తున్నారు' అని అల్కా పోస్ట్‌లో రాశారు.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా నేపథ్యం ఏంటి..
1992లో విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ABVP తరపున 1996-97 మధ్య DUSU అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తర్వాత కూడా ప్రజా సమస్యలపై గ్రౌండ్ లెవెల్లో చురుగ్గా ఉండేవారు. 2007లో నార్త్ పితంపురా కౌన్సిలర్‌గా ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 2025 ఎన్నికల్లో తొలిసారి షాలిమార్ బాగ్ ఎమ్మెల్యేగా ఆప్ అభ్యర్థి బందన కుమారిపై 29 ఓట్ల స్వల్ప తేడా గెలిచిన రేఖాకు.. ఢిల్లీ సీఎంగా అవకాశం ఇచ్చింది కాషాయపార్టీ. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిషీ తర్వాత ఢిల్లీ 4వ మహిళా సీఎం రేఖా గుప్తానే. ఈమె భర్త మనీష్ గుప్తా కూడా బీజేపీ పార్టీ సభ్యుడే.
Read Also : ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం..
బన్నీ సాధించిన మరో ఘనత.. ఏకంగా హాలీవుడ్‌లో..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..