Share News

Delhi CM: ఢిల్లీ కొత్త సీఎంపై నిరీక్షణకు తెర.. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఫిక్స్

ABN , Publish Date - Feb 16 , 2025 | 06:51 PM

దాదాపు 27 ఏళ్ల నిరీక్షణకు తెరపడి ఫిబ్రవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినను బీజేపీ కైవసం చేసుకుంది. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని హవా సాగించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది.

Delhi CM: ఢిల్లీ కొత్త సీఎంపై నిరీక్షణకు తెర.. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఫిక్స్

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించినప్పటికీ కొత్త సీఎం ఎవరనే విషయంలో నిరీక్షణ కొనసాగుతోంది. అయితే ఈ నిరీక్షణకు ఫిబ్రవరి 17వ తేదీ సోమవారంనాడు తెరపడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు కీలకమైన బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరుగనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష నేతను ఎందుకునేందుకు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో సమావేశమవుతున్నట్టు పేర్కొన్నాయి.

Mohan Bhagwat: దేశంలో బాధ్యతాయుతమైన సమాజం హిందూ సమాజమే


కాగా, ఢిల్లీ సీఎం ఎవరనే సస్పెన్స్‌కు మరో 2-3 రోజుల్లో తెరపడే అవకాశం ఉందని బీజేపీ ఎంపీ యోగేంద్ర చందోలియా శనివారంనాడు తెలిపారు. ఒకటి రెండ్రోజుల్లో కీలకమైన పార్లమెంటరీ సమావేశం జరుగుతుందని, అనంతరం దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు.


దాదాపు 27 ఏళ్ల నిరీక్షణకు తెరపడి ఫిబ్రవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని హవా సాగించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురు కీలక నేతలు ఓటమి చవిచూడగా, మాజీ ముఖ్యమంత్రి అతిషి మాత్రం తన సీటును నిలబెట్టుకున్నారు.


ఇవి కూడా చదవండి...

Maha Kumbh 2025: కుంభమేళాకు అర్థమే లేదు.. లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు

Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణం ఇదేనా?

Maharashtra: మహారాష్ట్రలో లవ్‌ జిహాద్‌ నియంత్రణకు చట్టం!

Ranveer Allahbadia: చంపుతామంటూ బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా పోస్ట్‌లో రణ్‌వీర్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2025 | 06:54 PM