Share News

Hema Malini: తొక్కిసలాట ఘటన మరీ పెద్దది కాదు, బూతద్దంతో చూడకూడదు

ABN , Publish Date - Feb 04 , 2025 | 06:33 PM

మహాకుంభ్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య దాచిపెడుతున్నారని, మేళా నిర్వహించడంలో యోగి సర్కార్ విఫలమైందని అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ హేమమాలిని తిప్పికొట్టారు.

Hema Malini: తొక్కిసలాట ఘటన మరీ పెద్దది కాదు, బూతద్దంతో చూడకూడదు

న్యూఢిల్లీ: మహాకుంభ మేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై సమాజ్‌వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పార్లమెంటులో చేసిన విమర్శలపై బీజేపీ ఎంపీ హేమమాలిని (Hema Malini) స్పందించారు. ఘటన జరిగినది నిజమే అయినా, మరీ అంత పెద్దది కాదని, అతిశయోక్తులు జోడించి మరీ పెద్దదిగా చిత్రీకరించరాదని అన్నారు.

Akhilesh Yadav: మహాకుంభ్ మృతుల లెక్కలు దాచిపెడుతున్నారు


మహాకుంభ్ నిర్వహణను అఖిలేష్ నిలదీస్తూ, మహాకుంభ్ ఏర్పాట్లపై మాట్లాడానికి బదులుగా ఆ ఆవెంట్‌ను ప్రచారం చేసుకునేందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిమితమైందనన్నారు. 100 కోట్ల మంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అమృత్‌స్నాన్ సకాలంలో నిర్వహించడంలో విఫలమైందని ఆరోపించారు. తొక్కిసలాట మృతుల లెక్కల్ని ప్రభుత్వం తొక్కిపెట్టిందని, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు జేసీబీలను ఉపయోగించిందని అన్నారు. మహాకుంభ్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ఈవెంట్ నిర్వహణకు ఆర్మీకి అప్పగించాలని డిమాండ్ చేశారు.


నిర్వహణ చాలా బాగుంది..

మహాకుంభ్ మేళా నిర్వహణ చాలా చక్కగా ఉందని, ఏర్పాట్లు బాగా చేశారని హేమమాలిని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ''మేము కుంభమేళా వెళ్లాం. పవిత్ర స్నానం ఆచరించాం. కుంభమేళాలో ఘటన (తొక్కిసలాట) జరిగిన మాట నిజమే. కానీ అది మరీ అంత పెద్ద ఘటన కాదు. ఈ ఘటనను పెద్దదిగా చేసి చూపుతున్నారు. అంతమంది వస్తున్నప్పుడు నిర్వహణ కష్టమే అయినప్పటికీ యూపీ ప్రభుత్వం చాలా బాగా నిర్వహిస్తోంది'' అని అన్నారు. గత మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయాగా, సుమారు 60 మంది గాయపడ్డారు.


మరిన్ని వార్తల కోసం..

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 04 , 2025 | 06:33 PM