Share News

Uttar Pradesh: మహాకుంభమేళాకు ఇండియన్ క్రికెట్ టీమ్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:11 PM

ఉత్తర్ ప్రదేశ్: ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Maha kumbh Mela) అంగరంగ వైభవంగా సాగుతోంది. గంగా, యమున, సరస్వతీ నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిచేందుకు ప్రతి రోజూ కోట్ల మంది భక్తులు తండోపతండాలుగా వెళ్తున్నారు.

Uttar Pradesh: మహాకుంభమేళాకు ఇండియన్ క్రికెట్ టీమ్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..
Indian cricketers at Maha Kumbh Mela

ఉత్తర్ ప్రదేశ్: ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Maha kumbh Mela) అంగరంగ వైభవంగా సాగుతోంది. గంగా, యమున, సరస్వతీ నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిచేందుకు ప్రతి రోజూ కోట్ల మంది భక్తులు తండోపతండాలుగా వెళ్తున్నారు. సనాతన ధర్మానికి ఆకర్షితులైన విదేశీయులు సైతం పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ఇప్పటికే పలువురు స్వదేశీ, విదేశీ ప్రముఖులు మహాకుంభమేళాకు వచ్చారు. అయితే తాజాగా భారత క్రికెట్ జట్టు (Indian cricket Team) స్టార్ ప్లేయర్లు మహాకుంభమేళాకు వెళ్లారు.

Liquor Ban: 17 ఆధ్యాత్మిక నగరాల్లో మద్యం షాపులు క్లోజ్‌


విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, హార్దిక్‌ పాండ్య, పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సహా పలువురు కుంభమేళాలో దర్శనమిచ్చారు. సంప్రదాయ దుస్తులు, హిందూ వేషధారణలతో క్రికెటర్లు కనిపించారు. అయితే అవి నిజమైన ఫొటోలు అనుకుంటున్నారా.. కాదండోయ్.. అవి ఏఐ జనరేటెడ్ పిక్స్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ద్వారా సృష్టించిన వాటిని "ది భారత్‌ ఆర్మీ" తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. స్టార్ ఆడగాళ్లు కుంభమేళాకు వెళ్తే ఇలానే ఉంటుందేమో అనే క్యాప్షన్‌తో పోస్టు చేసింది. కాగా, ఈ ఫొటోలు తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోలు చూసేందుకు అద్భతంగా ఉండడంతో వైరల్‌గా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

National Voters Day: నేడే జాతీయ ఓటర్ల దినోత్సవం.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..

Coldplay Ahmedabad Concert: అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే కచేరీ.. 3,800 మంది పోలీసులు.. 400 CCTVలతో భారీ భద్రత..

Updated Date - Jan 25 , 2025 | 12:14 PM