Minister: బాలకృష్ణన్‌కు మతిభ్రమించిందా ఏంటీ..
ABN , Publish Date - Jan 05 , 2025 | 02:43 PM
రెండు రోజుల క్రితం వరకు ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్(K. Balakrishnan)కు ఏమైందని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని విమర్శించడం మతిభ్రమించినట్లుగా ఉందని హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) విమర్శించారు.
- మంత్రి పీకే శేఖర్‌బాబు ధ్వజం
చెన్నై: రెండు రోజుల క్రితం వరకు ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్(K. Balakrishnan)కు ఏమైందని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని విమర్శించడం మతిభ్రమించినట్లుగా ఉందని హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) విమర్శించారు.
ఈ వార్తను కూడా చదవండి: Elephants: అడవి ఏనుగులను తరిమేందుకు గుంకీ ఏనుగుల రాక
విల్లుపురంలో శుక్రవారం ప్రారంభమైన సీపీఎం 24వ రాష్ట్రస్థాయి మహానాడులో బాలకృష్ణన్ ప్రసంగిస్తూ... అన్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో మహిళలకు అన్యాయం జరిగినా ఆ చర్యలను వ్యతిరేకిస్తూ ముందుగా పోరాడేది ఒక్క సీపీఎం మాత్రమేనని అన్నారు. మతవాద బీజేపీ, ఆర్‌ఎస్ఎస్(BJP, RSS)లను వ్యతిరేకిస్తున్న డీఎంకే(DMK) నేతృత్వంలోని లౌకికవాద కూటమిలో తాము పయనిస్తున్నామని,
అయితే హక్కుల కోసం రోడ్డెక్కి ఆందోళన చేపడుతున్న కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులను పోలీసులు అరెస్టుచేయడంతో పాటుకేసులు పెడుతున్నారని,ఈ చర్యలు అప్రకటిత ఎమర్జెన్సీ లాగా ఉందని బాలకృష్ణన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణన్ ప్రశ్నలకు సంబంధించి శనివారం మంత్రి శేఖర్‌బాబు మీడియాతో మాట్లాడారు. హార్బర్ ప్రాంతంలో పర్యటించిన ఆయన స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. న్యాయపరమైన హక్కుల కోసం పోరాడే ఆందోళనకారులను అణచివేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేపట్టడం లేదని, ఉదయం అరెస్టు చేసి సాయంత్రానికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను సమానంగా భావించి అందరికి లబ్ధి చేకూర్చే విధంగా పథకాలు ఉన్నాయని, మిత్రపక్షాలు ఆలోచించి ప్రభుత్వాన్ని విమర్శించాలని మంత్రి హితవు పలికారు.
ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే
ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం
ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు
Read Latest Telangana News and National News