TNCC: గవర్నర్ పదవికి రవి అనర్హుడు..
ABN , Publish Date - Jan 29 , 2025 | 12:14 PM
ద్వేషపూరిత రాజకీయ ప్రసంగాలు చేస్తున్న ఆర్‌ఎన్ రవి(RN Ravi) రాష్ట్ర గవర్నర్ పదవికి అనర్హులని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై(TNCC President Selvaperundagai) విమర్శించారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

- టీఎన్‌సీసీ చీఫ్ సెల్వపెరుందగై
చెన్నై: ద్వేషపూరిత రాజకీయ ప్రసంగాలు చేస్తున్న ఆర్‌ఎన్ రవి(RN Ravi) రాష్ట్ర గవర్నర్ పదవికి అనర్హులని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై(TNCC President Selvaperundagai) విమర్శించారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కడలూరు జిల్లా చిదంబరంలో జరిగిన స్వామి సహజానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ సామాజిక న్యాయం, సమానత్వం పేరుతో షెడ్యూల్ తెగల ప్రజలను ఒక దుష్టశక్తి విభజిస్తుంది’ అని వ్యాఖ్యానించారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Special trains: మహా కుంభమేళాకు మరో 4 ప్రత్యేక రైళ్లు
అణగారిన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించి సమాజిక న్యాయం, సమానత్వం కల్పించడంలో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. భారత రాజ్యాంగం 1950 అమల్లోకి వచ్చిన వెంటనే కమ్యూనల్ జీవో చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, దానికి వ్యతిరేకంగా తిరుచ్చిలో తందై పెరియార్ ఆందోళన చేశారని గుర్తుచేశారు.ఈ విషయాన్ని కామరాజర్.. నాటి ప్రధాని నెహ్రూ దృష్టికి తీసుకెళ్ళగా, భారత రాజ్యాంగంలో తొలి సవరణ చేసి రిజర్వేషన్లను పరిరక్షించారన్నారు. ఇప్పటివరకు రిజర్వేషన్లకు రక్షణ కవచంగా ఉండటానికి ప్రధాన కారణం తమిళనాడు అని గర్వంగా చెప్పవచ్చన్నారు.
ఒక దుష్టశక్తి రాష్ట్రాన్ని విభజిస్తుందని గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియడం లేదన్నారు. భారత రాజ్యాంగం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మోహన్ భగవత్ వంటి వారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచారన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆదిద్రావిడ ప్రజలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు, డాక్టర్ అంబేడ్కర్‌నే గవర్నర్ ఒక దుష్టశక్తితో పోల్చారని భావించాల్సి ఉందన్నారు. ఇలా సమాజంలో ద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్న ఆర్‌ఎన్.రవి రాష్ట్ర గవర్నర్ పదవికి ఏమాత్రం అర్హుడు కాదని సెల్వపెరుందగై వ్యాఖ్యానించారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు
ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను
Read Latest Telangana News and National News