Virat Kohli: కోహ్లీకి అదిరిపోయే ఆఫర్.. ఫ్యాన్స్ కోసమైనా మిస్ అవ్వొద్దు
ABN , Publish Date - Jan 26 , 2025 | 05:04 PM
Ranji Trophy 2025: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫ్యాన్స్ కోసమైనా ఈ ఆఫర్‌కు అతడు ఓకే చెబుతాడేమో చూడాలి.

రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా నుంచి శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ వరకు భారత స్టార్ ఆటగాళ్లంతా రంజీల బాట పట్టారు. ఇటీవల కాలంలో టీమిండియా టెస్టుల్లో వరుస వైఫల్యాలు చూసింది. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ, జడేజా లాంటి సీనియర్లు దారుణంగా విఫలమవడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. దీంతో తమ ఫామ్ మెరుగుపర్చుకునేందుకు, అదే టైమ్‌లో డొమెస్టిక్‌లో ఆడాల్సిందేననే బీసీసీఐ రూల్ పాటించడం కోసం రంజీ బరిలోకి దిగుతున్నారు స్టార్లు. అయితే కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ టోర్నీలో ఆడటం లేదు. దీంతో అతడికి స్పెషల్ ఆఫర్ ప్రకటించింది ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్. అది ఏంటో ఇప్పుడు చూద్దాం..
అదిరిపోయేలా ఏర్పాట్లు!
రంజీ బరిలోకి దిగాలని కోహ్లీ భావించాడు. ఫామ్, ఫిట్‌నెస్, టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకునేందకు పక్కా ఆడాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్లే సొంత జట్టు ఢిల్లీతో కలసి బ్యాటింగ్ సాధన కూడా చేశాడు. కానీ మెడ నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో అతడు ఆడలేదు. కొంత రెస్ట్ తీసుకున్న కింగ్ ప్రస్తుతం టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్‌తో కలసి ముంబైలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే రెండో రౌండ్ మ్యాచులకు అతడు కచ్చితంగా వస్తాడని ఢిల్లీ క్రికెట్ సంఘం భావిస్తోంది. అందుకు తగ్గట్లే స్పెషల్ అరేంజ్‌మెంట్స్ చేస్తూ అభిమానులను ఊరిస్తోంది.
ఎస్ అంటాడా?
అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే తదుపరి మ్యాచ్‌లో రైల్వేస్‌తో తలపడనుంది ఢిల్లీ. గత మ్యాచ్‌లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న ఆ జట్టు.. కోహ్లీపై భారీగా ఆశలు పెట్టుకుంది. 13 ఏళ్ల తర్వాత అతడు డొమెస్టిక్ బరిలోకి దిగుతుండటంతో చూసేందుకు భారీగా అభిమానులు తరలి వస్తారని డీడీసీఏ భావిస్తోంది. అందులో భాగంగా సెక్యూరిటీ పెంచాలని నిర్ణయించింది. దాదాపుగా 10 వేల మంది అభిమానులు వస్తారని భావిస్తున్న డీడీసీఏ.. నార్త్ ఎండ్, ఓల్డ్ క్లబ్ హౌస్‌ను ఓపెన్ చేయాలని అనుకుంటోందట. అదనపు సీటింగ్ సిద్ధం చేయడంతో పాటు టికెట్ల అవసరం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయింది. కోహ్లీ రాక కోసం స్పెషల్ అరేంజ్‌మెంట్స్ చేయడం, ఫ్యాన్స్‌కు ఫ్రీ టికెట్లు ఇస్తుండటంతో వాళ్ల కోసమైనా ఆఫర్‌కు ఎస్ అని చెప్పి అతడు మ్యాచ్ ఆడాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
మ్యాచ్‌లో ఎవరూ గమనించని సీన్.. వర్తు వర్మ వర్తు
రోహిత్-కోహ్లీ వల్లే కాలేదు.. తిలక్ వర్మ సాధించి చూపించాడు
తిలక్‌ను పొగుడుతున్నారు.. గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి