Share News

Mohammed Shami: షమీకి బీసీసీఐ షాక్.. ఇంగ్లండ్‌తో తొలి టీ20కి ముందు..

ABN , Publish Date - Jan 22 , 2025 | 07:25 PM

IND vs ENG: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి కమ్‌బ్యాక్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. గాయం నుంచి కోలుకొని ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైన వేళ.. స్పీడ్‌స్టర్‌కు అనూహ్య షాక్ తగిలింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Mohammed Shami: షమీకి బీసీసీఐ షాక్.. ఇంగ్లండ్‌తో తొలి టీ20కి ముందు..
Mohammed Shami

టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీకి కూడా సెలెక్ట్ అయ్యాడు. భారత జట్టుతో చేరిన షమి.. నెట్స్‌లో బౌలింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ చురుగ్గా కనిపించాడు. మునుపటి పేస్‌తో బంతులు వేస్తూ ఉత్సాహంగా దర్శనమిచ్చాడు. దీంతో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడు అదరగొట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. చాంపియన్స్ ట్రోఫీలోనూ అతడు దుమ్మురేపడం పక్కా అని డిసైడ్ అయ్యారు. ఈ తరుణంలో అనూహ్య షాక్ ఇచ్చింది భారత క్రికెట్ బోర్డు. అదేంటో ఇప్పుడు చూద్దాం..


ఆల్‌రౌండర్లపై నమ్మకంతో..!

స్టార్ పేసర్ మహ్మద్ షమీకి షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అతడు బరిలోకి దిగలేదు. ప్లేయింగ్ ఎలెవన్‌లో అతడికి చోటు దక్కలేదు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ రూపంలో కేవలం ఒకే పేసర్‌ను సెలెక్ట్ చేసింది టీమ్ మేనేజ్‌మెంట్. అతడికి తోడుగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేస్ బాధ్యతలు చూసుకుంటాడు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా వీరికి తోడ్పాటు అందిస్తాడు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి రూపంలో ముగ్గురు ప్రధాన స్పిన్నర్లతో బరిలోకి దిగింది భారత్. అయితే షమి రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ప్లేయింగ్ ఎలెవన్‌తో గట్టి షాక్ తగిలినట్లయింది. సిరీస్‌లో మరో 4 టీ20లు ఉన్నాయి. మరి.. షమీని ఎప్పుడు దించుతారో చూడాలి.


ఇవీ చదవండి:

పరువు కాపాడిన జైస్వాల్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

స్టార్ బౌలర్ కెరీర్ క్లోజ్.. అంతా ప్లాన్ ప్రకారమే

భారత్-ఇంగ్లండ్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ అందులోనే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 22 , 2025 | 07:25 PM