IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. డబ్బులు కట్టకపోతే అంతే సంగతులు
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:49 PM
IPL 2025 Streaming: ఐపీఎల్ లవర్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్. ఇక నుంచి డబ్బులు చెల్లించకపోతే ఊరుకునేలా కనిపించడం లేదు. ఒక్క సీజన్ గ్యాప్‌లో అంతా మారిపోయింది. దీనికి కారణం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

ఏడాది మొత్తంలో ఎన్ని టోర్నమెంట్లు ఉన్నా క్రికెట్ లవర్స్ ఫోకస్ మాత్రం ఐపీఎల్ మీదే ఉంటుంది. వేసవిలో నెలన్నర పాటు ఈ మెగా లీగ్ అందించే వినోదం అంతా ఇంతా కాదు. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే చెప్పాలి. స్థానిక ఆటగాళ్ల నుంచి ఇండియా స్టార్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్లు అందరూ కలసి ఆడుతుంటూ చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి. ఒకప్పుడు టీవీల్లో మాత్రమే క్యాష్ రిచ్ లీగ్ మ్యాచులు చూసేవారు. అయితే ఇప్పుడు ఓటీటీ యాప్స్ ద్వారా భారీ సంఖ్యలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. కానీ ఇకపై ఇది సాధ్యం కాకపోవచ్చు. ఐపీఎల్ స్ట్రీమింగ్ విషయంలో కొత్త అప్‌డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
కారణం ఇదే..!
ఐపీఎల్ కొత్త సీజన్‌కు మరో నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇంకా అఫీషియల్‌గా షెడ్యూల్ ప్రకటించనప్పటికీ ఎప్పటిలాగే మార్చి నెల మూడో వారంలో టోర్నమెంట్ ప్రారంభవం అవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మెగా లీగ్‌కు ముందు అభిమానులకు షాకింగ్ న్యూస్. ఈసారి ఐపీఎల్ మ్యాచుల్ని ఉచితంగా చూడటం కష్టమేనని తెలుస్తోంది. ఇక మీదట ఐపీఎల్ మ్యాచులు చూడాలంటే జేబుకు భారీగా చిల్లు పడాల్సిందేనని సమాచారం. దీనికి కారణం టోర్నీ మ్యాచుల్ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తూ వచ్చిన జియో సినిమా.. హాట్‌స్టార్‌తో మెర్జ్ కావడమేనని తెలుస్తోంది.
సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి!
ఐపీఎల్ ప్రసార హక్కుల్ని జియో సినిమా ఏకంగా 3 బిలియన్లు చెల్లించి మరీ దక్కించుకుంది. 2023 నుంచి రెండేళ్ల పాటు మ్యాచుల్ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేసింది. అయితే ఇటీవల జియోలో హాట్‌స్టార్ విలీనం అయింది. ఇవి రెండూ కలసి జియోహాట్‌స్టార్ అనే కొత్త స్ట్రీమింగ్ సర్వీస్‌ను అందిస్తున్నాయి. తదుపరి జరిగే ఐపీఎల్ మ్యాచులు ఇందులోనే స్ట్రీమింగ్ అవుతాయట. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఇక మీదట కొంతసేపు మ్యాచుల్ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తారట. మొత్తం మ్యాచ్ చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోక తప్పదట. బేసిక్ ప్లాన్ కింద రూ.149, యాడ్స్ లేని ప్లాన్ కింద రూ.499 చార్జ్ చేస్తారని సమాచారం. దీనికి అదనంగా ప్రతి 3 నెలలకు రూ.299 కట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఒకప్పుడు ఉచితంగా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉండటంతో ఐపీఎల్‌కు కోట్లలో వ్యూస్ వచ్చాయి. మరి.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ పెట్టారు కాబట్టి ఇకపై క్యాష్ రిచ్ లీగ్ వ్యూస్ ఎలా ఉంటాయనేది చూడాలి.
ఇవీ చదవండి:
చాంపియన్స్ ట్రోఫీ ఫుల్ స్క్వాడ్స్.. ఆ 3 జట్లతో భారత్‌కు యమా డేంజర్
అభిషేక్ శర్మకు సన్‌రైజర్స్ బంపరాఫర్
బీసీసీఐకి భారీగా బొక్క పెట్టిన స్టార్ బ్యాటర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి