Share News

Rohit Sharma: నేను బతికేది దాని కోసమే.. అస్సలు వదలను: రోహిత్

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:34 PM

Champions Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ ఫోకస్ చాంపియన్స్ ట్రోఫీ మీదే పెట్టాడు. మెగా టోర్నీలో భారత్‌ను విజేతగా నిలబెట్టాలని అతడు కసితో ఉన్నాడు.

Rohit Sharma: నేను బతికేది దాని కోసమే.. అస్సలు వదలను: రోహిత్
Rohit Sharma

భారత సారథి రోహిత్ శర్మ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. అచ్చొచ్చిన వైట్‌బాల్ క్రికెట్‌లో టీమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడిపిస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో అతడి కెప్టెన్సీలోని మెన్ ఇన్ బ్లూ ఆడిన తొలి 2 మ్యాచుల్లో విజయాలు సాధించి సెమీస్‌కు క్వాలిఫై అయింది. తదుపరి న్యూజిలాండ్‌ మ్యాచ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా నాకౌట్స్‌కు అర్హత సాధించింది భారత్. సెమీస్, ఫైనల్స్‌లోనూ నెగ్గితే టీమిండియా ఖాతాలో మరో కప్పు వచ్చి చేరుతుంది. అందుకే మెగా టోర్నీ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు హిట్‌మ్యాన్. టీమ్ గెలుపు కోసం వ్యూహాలు పన్నుతూ బిజీబిజీగా ఉన్నాడు.


నా సంతోషం అందులోనే..

వన్డే వరల్డ్ కప్-2023 కప్‌ను త‌‌‌ృటిలో చేజార్చుకుంది భారత్. ఫైనల్‌ వరకు ఓటమి అనేది లేకుండా దూసుకెళ్లిన రోహిత్ సేన.. తుదిమెట్టుపై జారి కప్పును చేజార్చుకుంది. అందుకే ఈసారి ఆ తప్పిదాలు జరగకూడదని హిట్‌మ్యాన్ భావిస్తున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాల్సిందేనని పంతంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు క్రికెట్ తప్ప వేరే ధ్యాస లేదన్నాడు రోహిత్. తాను బతికేదే క్రికెట్ కోసమని తెలిపాడు. ఈ ఆటలోనే తాను సంతోషాన్ని వెతుక్కుంటున్నానని చెప్పుకొచ్చాడు.


బతికేది క్రికెట్ కోసమే

‘క్రికెటే నాకు సర్వస్వం. నేను బతికేది ఈ ఆట కోసమే. ఈ గేమ్ నాకు సంతోషాన్ని ఇస్తోంది. ఎవరైనా ఆనందాన్ని వద్దనుకుంటారా?’ అని రోహిత్ ఎదురు ప్రశ్నించాడు. గేమ్‌ను వదిలి ఉండలేనన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుస విజయాలపై అతడు హర్షం వ్యక్తం చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్‌లో ఆడిన తీరుపై హిట్‌మ్యాన్ ప్రశంసల జల్లులు కురిపించాడు. దేశానికి ఆడటం అంటే విరాట్‌కు ఎంతో ప్రేమ అని, టీమ్‌ కోసం ఏం చేయడానికైనా అతడు సిద్ధంగా ఉంటాడని తెలిపాడు. మ్యాచ్‌ను ఫినిష్ చేయడం కోహ్లీకి మంచి చేస్తుందని, అతడి కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుందన్నాడు రోహిత్.


ఇవీ చదవండి:

52 ఏళ్ల వయసులోనూ సచిన్ రప్పా రప్పా

నేను టీమిండియాను తప్పుపట్టలేదు: ప్యాట్ కమిన్స్

మ్యాచ్‌లన్నీ ఒక్కచోటే ఆడిస్తే ఎలా?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 26 , 2025 | 12:51 PM