Hyderabad: గజం @ రూ. 1.90 లక్షలు..
ABN , Publish Date - Jan 31 , 2025 | 08:57 AM
తెలంగాణ హౌసింగ్‌బోర్డు నార్త్ డివిజన్(Telangana Housing Board North Division)లోని స్థలాల వేలం పాట గురువారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఏడు స్థలాలకు గాను మూడు సేల్ అయ్యాయి. గచ్చిబౌలిలో 81.45 గజాల నివాస స్థలానికి గజం రూ.1.90లక్షలు పలకడం గమనార్హం.

- ప్రశాంతంగా ముగిసిన హౌసింగ్‌బోర్డు స్థలాల వేలం
- నార్త్ డివిజన్‌లో 7కు 3 స్థలాలే విక్రయం
- గచ్చిబౌలిలోని స్థలానికి అత్యధిక ధర
హైదరాబాద్: తెలంగాణ హౌసింగ్‌బోర్డు నార్త్ డివిజన్(Telangana Housing Board North Division)లోని స్థలాల వేలం పాట గురువారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఏడు స్థలాలకు గాను మూడు సేల్ అయ్యాయి. గచ్చిబౌలిలో 81.45 గజాల నివాస స్థలానికి గజం రూ.1.90లక్షలు పలకడం గమనార్హం. అలాగే కూకట్‌పల్లి బాలాజీనగర్(Kukatpally Balajinagar)లో 87.98 గజాల (కమర్షియల్ ) స్థలం గజం రూ.1.85లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అదే కాలనీలో 92.36 కమర్షియల్ స్థలం గజం రూ.1.75లక్షల చొప్పున వేలంలో దక్కించుకున్నారు. ఏడింటిలో రెండింటిపై కోర్టుకు వెళ్లినా అధికారులకే అనుకూలంగా తీర్పు రావడంతో వేలం ప్రక్రియ సజావుగా సాగింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పూర్ణా.. ఆల్ ది బెస్ట్..
నార్త్ డివిజన్ ఈఈ అంకమరావు, ఎస్టేట్ ఆఫీసర్ విమల, ఏఈవో సుజన, పీఆర్వో వాసు పాల్గొన్నారు. వేలంలో పాడుకున్న వారు 48 గంటల్లోగా 25 శాతం డీడీల రూపంలో చెల్లించాలని సూచించారు. ఈనెల 24న వేలం జరిగిన రోజు బీఆర్‌ఎస్, జనసేన, టీడీపీ(BRS, Janasena, TDP) నేతల హడావిడి వల్ల గందరగోళం ఏర్పడగా.. తాజాగా రాజకీయ నాయకులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. దీంతో పోలీసులు కూడా బారికేడ్లతో రోడ్లు మూసేయకుండా కేవలం ఎంట్రీ, ఎగ్జిట్ వద్దనే పహరా కాశారు.
ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్
Read Latest Telangana News and National News