KTR: అన్నీ కటింగ్‌లు.. కటాఫ్‌లే.. కేటీఆర్ విమర్శనాస్త్రాలు
ABN , Publish Date - Jan 20 , 2025 | 09:55 AM
KTR: కటింగులు, కటాఫ్‌లు మినహా ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమిటి అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘రుణమాఫీ కటింగ్.. రైతుభరోసా కటింగ్.. సాగునీళ్లు కటింగ్.. కరంటు కటింగ్.. కేసీఆర్ కిట్ కటింగ్ .. న్యూట్రిషన్ కిట్ కటింగ్.. తులంబంగారం కటింగ్.. మహాలక్ష్మి రూ.2500 కటింగ్.. ఫించను రూ.4000 వేలు కటింగ్.. రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు కటింగ్.. జాబ్ క్యాలెండర్ కటింగ్’’ అని అన్నారు.

హైదరాబాద్, జనవరి 20: కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt) తొలి నుంచి బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR).. కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎక్స్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదని.. కటింగులు, కటాఫ్‌లు తప్ప అంటూ వ్యాఖ్యలు చేశారు. అన్నింటిలోనూ కటింగ్‌లే అని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతీ హామీల్లోనూ కటింగ్‌లు, కటాఫ్‌లతో ప్రజలను మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు మాజీ మంత్రి. ఇంతకీ కేటీఆర్ ట్వీట్టర్‌లో కాంగ్రెస్‌ను ఎలా ఏకిపారేశారో చూద్దాం.
కేటీఆర్ ట్వీట్..
‘‘కటింగులు, కటాఫ్ లు మినహా ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమిటి? రుణమాఫీ కటింగ్.. రైతుభరోసా కటింగ్.. సాగునీళ్లు కటింగ్.. కరంటు కటింగ్.. కేసీఆర్ కిట్ కటింగ్ .. న్యూట్రిషన్ కిట్ కటింగ్.. తులంబంగారం కటింగ్.. మహాలక్ష్మి రూ.2500 కటింగ్.. ఫించను రూ.4000 వేలు కటింగ్.. రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు కటింగ్.. జాబ్ క్యాలెండర్ కటింగ్ .. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కటింగ్.. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు కటింగ్.. తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు రూ.25 వేల పింఛను కటింగ్.. ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం కటింగ్.. రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు కటింగ్.. భూమిలేని రైతులకు సైతం రైతు బీమా కటింగ్.. నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం కటింగ్ .. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి కటింగ్ .. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం కటింగ్ .. ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం కటింగ్ .. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు కటింగ్.. 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ. 3 వేల పెన్షన్ కటింగ్.. రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం, కమీషన్ కటింగ్’’ అంటూ మండిపడ్డారు.
వరుసగా రికార్డులు బద్దలు కొడుతోన్న ట్రంప్
ఆర్టీసీ విలీన ప్రక్రియ కటింగ్.. ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి రూ.12 వేలు కటింగ్.. విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ కటింగ్.. కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు కటింగ్.. 200 యూనిట్లు ఉచిత కరంటు కటాఫ్.. రూ.500 గ్యాస్ సిలిండర్ కటాఫ్.. రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేలు కటాఫ్.. ఆఖరుకు ఇందిరమ్మ ఇళ్లకు కటాఫ్ పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు కటాఫ్ ఎందుకు ? అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు కట్టించి ఎందుకు ఇవ్వరు? డబల్ బెడ్రూంలకు మూడు రంగులు వేసి మురిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. జాగో తెలంగాణ జాగో’’ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad: నాలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్ చేస్తున్న దొంగల ముఠా..
Davos: సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన
Read Latest Telangana News And Telugu News