Share News

Supreme Court: సుప్రీంలో కేటీఆర్‌కు దక్కని ఊరట

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:31 AM

Telangana: మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. సుప్రీం కోర్టులో కేటీఆర్‌ వేసిన క్వాష్ పిటిషన్‌‌ను విచారించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.

Supreme Court: సుప్రీంలో కేటీఆర్‌కు దక్కని ఊరట
Supreme Court of India

హైదరాబాద్, జనవరి 9: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (Former Minister KTR) సుప్రీం కోర్టులో (Supreme Court) ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌‌ను రేపు (శుక్రవారం) విచారణకు తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. ఈనెల 15న సుప్రీంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. 15వ తేదీన విచారణకు లిస్ట్ చేసినందున అదే రోజు విచారిస్తామని సీజే స్పష్టం చేశారు. అప్పటి దాకా కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు... కేటీఆర్‌ వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరినప్పటికీ సుప్రీం కోర్టు సీజేఐ నిరాకరించారు.


హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన వెంటనే సుప్రీం కోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే దాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదంటూ 15 విచారణ జరుపుతామంటూ ఆరోజు లిస్ట్ చేశారు. అయితే ఈరోజు కేటీఆర్ తరపు న్యాయవాదులు సీజేఐ ధర్మాసనం ముందు హాజరై.. ఇది చాలా సున్నితమైన అంశమని.. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నందున్న ఈరోజు లేదా రేపు విచారణ జరపాలని కేటీఆర్ న్యాయవాదు కోరారు. అయితే ఇది అంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతూ ఈనెల 15న విచారణకు లిస్ట్ చేసినందున ఇక ఆరోజే విచారస్తామని సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఆమెను కాపాడాలని చూస్తే.. ఆరుగురు బలయ్యారు..


మరోవైపు ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్.. ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ముగ్గురు ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల మళ్లింపై కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం వరకు ఏసీబీ విచారణ కొనసాగనుంది. అయితే విచారణ అనంతరం కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి...

కేటీఆర్‌ ఇంటికా? జైలుకా?

KTR: అవసరమైతే చచ్చిపోతా.. కేటీఆర్ సంచలన కామెంట్స్

Read Latest Telangana News And Telugu news

Updated Date - Jan 09 , 2025 | 01:20 PM