ఆశా వర్కర్ల ఆందోళన
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:06 AM
ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆశా వర్కర్లు నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన తెలిపారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి.జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆశ వర్కర్లు ఫిక్స్ వేతనం 18 వేల రూపాయలు చెల్లించా లని, పెండింగ్ బిల్లులు చెల్లింపు, అధిక పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.

పెద్దపల్లి టౌన్ మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆశా వర్కర్లు నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన తెలిపారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి.జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆశ వర్కర్లు ఫిక్స్ వేతనం 18 వేల రూపాయలు చెల్లించా లని, పెండింగ్ బిల్లులు చెల్లింపు, అధిక పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలయ్యే వరకు ఆశా వర్కర్లు పోరా టాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. రేణుక స్వప్న, రాధ, వెంకటేశ్వరి, తిరుమల, పద్మ, లత, శోభ, సరోజ, అనూష, రాజేశ్వరి, రజిత పాల్గొన్నారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న ఆశా కార్యకర్త లపై పోలీసు దాడులను నిరసిస్తూ రెవెన్యూ కార్యాల యం ఎదుట ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పలువురు మాట్లాడుతూ హైదరాబాద్ కమిషనర్ కార్యా లయానికి వెళ్లిన ఆశా కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం సమంజసం కాదన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకే పోరాడుతున్నామని, ఇచ్చిన డిమాండ్లను పరిష్కరించకుండా మహిళలపై పోలీస్‌లు దాడులు చేయడం అప్రజాస్వామ్యమని తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని రెవెన్యూ కార్యాలయం ఎదుట మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశా రు. సువర్ణ, పద్మ, నీరజ, శివలీల, అప్సనాతో పాటు పలువురు పాల్గొన్నారు.
కమాన్‌పూర్, (ఆంధ్రజ్యోతి) : న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాడుతున్న ఆశాకార్యకర్తలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు.
వారు మాట్లా డుతూ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అమృత, బర్ల రమాదేవి, దేవి మల్లేశ్వరి, తనుకుల విజయ, గొట్టె రాజేశ్వరి, శిలారపు కళ్యాణి, బేద కృష్ణవేణి, బంక శ్యామల, పంతకాని పుష్పలత, మేకల గౌతమి, చిప్పకుర్తి స్వరూప, బర్ల స్వప్నలు పాల్గొన్నారు.