Special trains: చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్‌కు ప్రత్యేకరైళ్లు
ABN , Publish Date - Feb 15 , 2025 | 08:43 AM
వారాంతాల్లో రద్దీని నివారించే నిమిత్తం చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్(Cherlapalli-Srikakulam Road) మధ్య రెండు ప్రత్యేకరైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

హైదరాబాద్ సిటీ: వారాంతాల్లో రద్దీని నివారించే నిమిత్తం చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్(Cherlapalli-Srikakulam Road) మధ్య రెండు ప్రత్యేకరైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. ఈ నెల 21వ తేదీ రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి నుంచి (07025)ప్రత్యేకరైలు బయలుదేరి నల్గొండ, నడికుడి. పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం(Piduguralla, Guntur, Vijayawada, Eluru, Tadepalligudem), రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వా డ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి(Vizianagaram, Cheepurupalli) మీదుగా శ్రీకాకాళం రోడ్డు చేరుకుంటుంది. తిరిగి 22న మధ్యాహ్నం 2.15గంటలకు శ్రీకాకుళం రోడ్ నుంచి (07026) ప్రత్యేకరైలు ప్రారంభమవుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్(CPRO Sridhar) తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: CP CV Anand: యజమానులు కోరితే కష్టమైనా వెరిఫికేషన్ చేస్తాం..
ఈవార్తను కూడా చదవండి: రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు
ఈవార్తను కూడా చదవండి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?
ఈవార్తను కూడా చదవండి: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే
Read Latest Telangana News and National News