AP Assembly : అసెంబ్లీ లాబీలో ఆనం, కోటంరెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ

ABN , First Publish Date - 2023-03-15T12:42:37+05:30 IST

ఆనం రాం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలే. ఆనం అయితే నిన్న అంటే అసెంబ్లీ ప్రారంభం రోజున ఏకంగా టీడీపీ వాళ్లతో పాటు కూర్చుండిపోయారు.

AP Assembly : అసెంబ్లీ లాబీలో ఆనం, కోటంరెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ

అమరావతి : ఆనం రాం నారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఇద్దరూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలే. ఆనం అయితే నిన్న అంటే అసెంబ్లీ (AP Assembly) ప్రారంభం రోజున ఏకంగా టీడీపీ (TDP) వాళ్లతో పాటు కూర్చుండిపోయారు. అయితే ఇవాళ సడెన్‌గా అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలు ఆనం రాం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఎదురు పడ్డారు. వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అసెంబ్లీ లాబీల్లో కలుసుకున్న వీరిద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రస్తావన వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని ఆనంకు చెప్పానని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో (MLA Quota Elections) అదే ఆచరిస్తారా? అని ప్రశ్నించారట. దీనికి తాను ఎప్పుడూ ఆత్మ ప్రబోధానుసారమే ఓటేస్తానంటూ ఆనం వ్యాఖ్యానించారు.

నేటి ఉదయం కోటంరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందన్నారు. సమస్యలను పరిస్కరిస్తే తానే ముఖ్యమంత్రి ని అభినందిస్తానన్నారు. 4 ఏళ్ళు సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయే గళం వినిపిస్తున్నానన్నారు. మైకు ఇచ్చే వరకూ అసెంబ్లీలో మైక్ అడుగుతూనే ఉంటానన్నారు. మైక్ ఇవ్వకుంటే తన నిరసన ప్లకార్డుల రూపేణా నిలబడి ప్రదర్శిస్తూనే ఉంటానన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పచ్చ కండువా కప్పి రాజధాని రైతులు మద్దతు తెలిపారు. ప్లకార్డు ప్రదర్శన వద్దంటూ కోటంరెడ్డిని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లే తనని అడ్డుకునే హక్కు పోలీసులకు లేదంటూ ప్లకార్డు ప్రదర్శనతోనే అసెంబ్లీకి కోటంరెడ్డి వెళ్లారు.

Updated Date - 2023-03-15T12:42:37+05:30 IST