Share News

Ganji Chiranjeevi: మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జిగా గంజి చిరంజీవి

ABN , First Publish Date - 2023-12-11T21:06:32+05:30 IST

మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జిగా గంజి చిరంజీవులను నియమిస్తూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది. సోమవారం నాడు ఎమ్మెల్యే, పార్టీకి ఆళ్లరామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Ganji Chiranjeevi: మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జిగా గంజి చిరంజీవి

తాడేపల్లి: మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జిగా గంజి చిరంజీవులను నియమిస్తూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది. సోమవారం నాడు ఎమ్మెల్యే, పార్టీకి ఆళ్లరామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈమేరకు రెండింటికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయిన రాజీనామా చేయడంతో తాడేపల్లి ప్యాలెస్‌‌లో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కొంతమంది కీలక నేతలతో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సీఎం జగన్‌తో అరగంటపాటు నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ ఆళ్ల అయోధ్యరెడ్డి, గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ హనుమంతరావు, దొంతు వేమారెడ్డి పాల్గొన్నారు.

వైసీపీలో ఇక ముసలమేనా..!

గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావుకు ప్రాధాన్యత ఇవ్వడం.. హామీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆర్కే తీవ్ర మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. అధిష్టానంపై అలకతో ఎమ్మెల్యేగా స్పీకర్ ఫార్మాట్‌లో.. పార్టీకి కూడా ఆర్కే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆర్కే రాజీనామాతో మంగళగిరి వైసీపీలో ముసలం నెలకొంది. ఆర్కే బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఆర్కే స్థానాన్ని బీసీకి ఇస్తాం

ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలనే రాజీనామా చేశారని వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆర్కే మరింతగా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉంటారు. క్యాడర్ అంతా బాగా పనిచేస్తోంది. ముఖ్యమంత్రి సూచనను అందరూ పాటిస్తారు. రామకృష్ణారెడ్డి త్యాగం చేసినా ఓ బీసీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాం. ఆర్కేకి అత్యంత గౌరవం పార్టీలో, ప్రభుత్వంలో ఉంది’’ అని అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-12-11T21:31:06+05:30 IST