Minister Karumuri: చంద్రబాబు ఇలా మాట్లాడటం దారుణం..
ABN , First Publish Date - 2023-08-10T15:10:12+05:30 IST
విజయవాడ: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు రౌడీలా, గూండాలా వ్యవహరించారని, వయసు పెరిగిన ఆయన ఇలా మాట్లాడటం దారుణమన్నారు.
విజయవాడ: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri Nageswara Rao) తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు (TDP Chief Chandrababu)పై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు రౌడీలా, గూండాలా వ్యవహరించారని, వయసు పెరిగిన ఆయన ఇలా మాట్లాడటం దారుణమన్నారు. ‘కొట్టండి నా కొడుకులను’ అంటూ టిడిపీ కార్యకర్తలను (TDP Activits) పోలీసులపైకి ఉసిగొలిపారని విమర్శించారు. వాళ్లు కొడుతుంటే పోలీసులు సమన్వయంతో వ్యవహరించారు. వారికి సెల్యూట్ చేయాలన్నారు. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)లు కలిసి పోటీ చేయాలని.. సీఎం జగన్ (CM Jagan) సింహం.. సింగిల్‌గా వస్తారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లు ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగాలని.. అలా కాకుండా జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.