Rajinikanth: విజయవాడ చేరుకున్న సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఘన స్వాగతం

ABN , First Publish Date - 2023-04-28T09:56:56+05:30 IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కాసేపటి క్రితమే విజయవాడ చేరుకున్నారు.

Rajinikanth: విజయవాడ చేరుకున్న సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఘన స్వాగతం

అమరావతి: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (SuperStar Rajinikanth) కాసేపటి క్రితమే విజయవాడ చేరుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజినీకాంత్ విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో రజినీకాంత్‌ను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Balakrishna), టీడీ జనార్దన్, సావనీర్ కమిటీ రిసీవ్ చేసుకుని ఘన స్వాగతం పలికారు. గతంలో 2004 కృష్ణానది పుష్కరాల సందర్భంలో కృష్ణాజిల్లాకు వచ్చిన రజినీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు విజయవాడకు చేరుకున్నారు. సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజినీకాంత్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) తేనేటి విందు ఇవ్వనున్నారు.

సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభ జరుగనుంది. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై ఈరోజు రెండు పుస్తకాల విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్య పరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, టీడీపీ అధినేత చంద్రబాబు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. అలాగే ఎన్టీఆర్‌పై తొలి పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్టు ఎస్. వెంకటనారాయణ సభలో పాల్గొననున్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-04-28T10:16:32+05:30 IST