Bear Chasing: మహానందిలో ఎట్టకేలకు బోనులో చిక్కిన ఎలుగుబంటి..
ABN , First Publish Date - 2023-09-05T10:37:34+05:30 IST
మహానంది ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది.
నంద్యాల: మహానంది ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది. మహానంది క్షేత్రంలో ఆపరేషన్ ఎలుగు బంటి సక్సెస్ అయ్యింది. అటవీ శాఖ సిబ్బంది, స్థానికులకు ఎలుగుబంటి చిక్కింది. గత ఐదు రోజులుగా భక్తులను, స్థానికులను ఎలుగుబంటి భయబ్రాంతులకు గురిచేసింది. అర్థరాత్రి క్షేత్రం సమీపంలోని ఎంప్లాయిస్ కాలనీ ఈశ్వర నగర్‌లో ఎలుగుబంటి సంచరించింది. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగింది. ఎలుగుబంటి, అటవీశాఖ సిబ్బంది. స్థానికుల మధ్య గంటనర్ర సేపు చేజింగ్ సీన్ జరిగింది. అయితే ఎలుగుబంటి యాదృచ్ఛికంగా ఖాళీగా ఉన్న ఇంట్లోకి వెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు, స్థానికులు కలిసి ఆ ఇంటి తలుపులను మూసివేసి ఎలుగుబంటిని బంధించారు. బోను తెచ్చి ఎలుగుబంటిని తరలించడానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టకేలకు ఎలుగుబంటి బోనులో చిక్కడంతో భక్తులు, స్థానికులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.