Ayyannapatrudu: ఆఫ్ట్రాల్ ఒక ఎంపీని ఎందుకు అరెస్ట్ చేయలేదు.. సీబీఐను ప్రశ్నించిన అయ్యన్న

ABN , First Publish Date - 2023-06-07T12:30:21+05:30 IST

కేంద్ర మంత్రులు, సీఎంలు పనిచేసిన వారిని అరెస్ట్ చేసిన సీబీఐ... మాజీ మంత్రి వైఎస్‌ వివేకాహత్య కేసులో ఆఫ్ట్రాల్ ఒక ఎంపీని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

Ayyannapatrudu: ఆఫ్ట్రాల్ ఒక ఎంపీని ఎందుకు అరెస్ట్ చేయలేదు.. సీబీఐను ప్రశ్నించిన అయ్యన్న

నంద్యాల: కేంద్ర మంత్రులు, సీఎంలు పనిచేసిన వారిని అరెస్ట్ చేసిన సీబీఐ... మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో ఆఫ్ట్రాల్ ఒక ఎంపీని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు (TDP Leader Ayyannapatrudu) ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కర్నూలులో వైసీపీ గూండాలు సీబీఐణఇ అడ్డుకోవడం వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. 30 మంది వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డిని కాపాడడం తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు. సీబీఐ (CBI) కేసులో కోర్టుకు వెళ్లకుండా ఇన్నేళ్ళు ఉండటం దేశ చరిత్రలో సీఎం జగన్‌కే దక్కుతుందని వ్యాఖ్యలు చేశారు. వైఎస్.వివేకా హత్య కేసులో దుర్మార్గులతో రాజీ లేని పోరాటం చేసున్న డాక్టర్ సునీతకు అభినందనలు తెలియజేశారు. డాక్టర్ సునీతకు ప్రజలందరూ అండగా నిలబడాలని అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-06-07T12:30:21+05:30 IST