Anil kumar: లోకేశ్‌ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్

ABN , First Publish Date - 2023-07-05T10:52:09+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేషశ్‌కు ఎమ్మెల్యే అనిల్ కుమార్ సవాల్ విసిరారు. అధికారంలో ఉండి తాను వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించానని చెబుతున్న నారా లోకేశ్‌... సిట్ కాకపోతే సీబీఐ వేసుకోవాలని.. రాజకీయాల్లోకి వచ్చి తాను ఆస్తులు పోగొట్టుకున్నానని. దీనిపై తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేయమన్నా సిద్ధమని స్పష్టం చేశారు.

Anil kumar: లోకేశ్‌ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్

నెల్లూరు: టీడీపీ యువనేత నారా లోకేషశ్‌కు (TDP Leader Nara lokesh) ఎమ్మెల్యే అనిల్ కుమార్ (MLA Anilkumar) సవాల్ విసిరారు. అధికారంలో ఉండి తాను వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించానని చెబుతున్న నారా లోకేశ్‌... సిట్ కాకపోతే సీబీఐ వేసుకోవాలని.. రాజకీయాల్లోకి వచ్చి తాను ఆస్తులు పోగొట్టుకున్నానని. దీనిపై తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేయమన్నా సిద్ధమని స్పష్టం చేశారు. ‘‘రాజకీయాల్లోకి రాకముందు మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తిలో కంటే ఒక్క పైసా ఎక్కువ ఉన్నా, భగవంతుడు నన్ను శిక్షిస్తాడు. లోకేష్... ఎక్కడకి రమ్మన్నా నేను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇస్కాన్ సిటీలో పద్దెనిమిదిన్నర ఎకరాలు ఉంటే ప్రస్తుతం అమ్మివేసి మూడు ముక్కలుగా ఎకరా మాత్రమే ఉంది. ఆరోపణ చేసేటప్పుడు సిగ్గుండాలి. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న మూడు ఎకరాలని అమ్మేశా. టేక్కేమిట్ట స్థలం కూడా అమ్మి రాజకీయాలు చేశా. నా తమ్ముడు అశ్విన్ మొదటి నుంచి ఒక హాస్పిటల్లో షేర్ హోల్డర్‌గా ఉన్నాడు. గంజాయి తరలించే ముఠాకి టీడీపీ నేతలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలని సాక్షాత్తు నీ పక్కన ఉన్న నెల్లూరు ఇంచార్జ్ నాకు రూ. 50 లక్షలు పంపితే నేను వెనక్కి పంపా. దీనిపై ఇప్పటి వరకు ఆ పెద్దమనిషి నోరు విప్పి మాట్లాడలేదు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు పోతుంటే హైదరాబాదుకు వెళ్లి దాక్కున్న నారాయణ, నేడు రావడానికి సిగ్గుండాలి. ఇలాంటి విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తి గొప్పవాడని లోకేష్ చెప్పటానికి సిగ్గుండాలి’’ అంటూ అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-05T10:52:09+05:30 IST