Perni Nani: సానుభూతి కోసమే వైపీసీపై కోటంరెడ్డి ఆరోపణలు
ABN , First Publish Date - 2023-02-01T17:58:33+05:30 IST
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA), మాజీ మంత్రి పేర్నినాని (Perni Nani) విమర్శలు గుప్పించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA), మాజీ మంత్రి పేర్నినాని (Perni Nani) విమర్శలు గుప్పించారు. వెళ్లిపోయే ముందు కావాలనే పార్టీపై బురద జల్లుతున్నారని పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సానుభూతి కోసమే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) జరిగితే 3 నెలల ముందే చెప్పొచ్చు కదా? అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy)ని పేర్నినాని ప్రశ్నించారు. మన ఆలోచనల్లో తప్పు లేనప్పుడు ఫోన్ రికార్డయినా తప్పేముంది? అని వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే ప్రభుత్వానికి పనా?, నిజంగా అనుమానం వస్తే వచ్చి మాట్లాడాలని పేర్నినాని చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడైతే పార్టీ మారడం ఎందుకు? అని పేర్నినాని ప్రశ్నించారు.
అంతకు ముందు మీడియా ముందు తన ఫోన్ ట్యాపింగ్‌పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధారాలు బయటపెట్టారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే నమ్మలేదని, సీఎంపై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించానని, కానీ 20 రోజుల ముందు తన ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికిందని శ్రీధర్ రెడ్డి అన్నారు. సీఎం గానీ, సజ్జల గానీ చెప్పకుండా తన ఫోన్ ట్యాప్ చేయరని, అనుమానాలు ఉన్న చోట తానుండాల్సిన అవసరం లేదని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్నానని తన ఫోన్ ట్యాంపింగ్ చేశారని కోటంరెడ్డి ఆరోపించారు.